నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘హిట్ 3’తో ప్రేక్షకులను అలరించిన నాని, ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నానికి ‘దసరా’ వంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు మరోసారి దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే ఈ మూవీపై మొదటి రోజు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్ లుక్, గ్లింప్స్ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. దసరా కంటే కూడా పెద్ద స్కేల్‌లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు శ్రీకాంత్ భారీ బడ్జెట్‌తో పని చేస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్సులు, క్యారెక్టర్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ నెక్ట్స్ లెవెల్‌లో డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ప్యారడైజ్’ షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతున్నా, ఇంకా కొంత భాగం పెండింగ్ ఉండటంతో ప్రకటించిన రిలీజ్ డేట్‌కు సినిమా రెడీ అవుతుందా అన్న సందేహాలు అభిమానుల్లో కనిపిస్తున్నాయి.
Also Read : Dulquer Salmaan: “నా మీద అలాంటి విమర్శలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి”
ఇదిలా ఉండగా, చిత్రబృందం నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ సింగిల్ ఇప్పటికే ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశముందని అంటున్నారు. ఈ సాంగ్‌లో నాని పాత్రను ఇంట్రడ్యూస్ చేసే విధంగా కాన్సెప్ట్ డిజైన్ చేసినట్టు సమాచారం. ఇక నాని ఫ్యాన్స్ మాత్రం“రిలీజ్ లేట్ అయినా పర్లేదు, కానీ అవుట్‌పుట్ మాత్రం టాప్ క్లాస్‌గా రావాలి” అని సోషల్ మీడియాలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.