Dasara: నాని కొత్త సినిమా షూటింగ్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత యేడాది దసరా సందర్భంగా నాని కొత్త సినిమా ‘దసరా’కు సంబంధించిన ప్రకటనతో పాటు ఓ గ్లింప్స్ విడుదలైంది. నేచురల్ స్టార్ నాని సరసన జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం మొదలైంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న మాస్ ఎంటర్ టైనర్ ‘దసరా’లో నాని గతంలో ఎన్నడూ చూడని ఓ సరికొత్త గెటప్ తో కనిపించబోతున్నాడు.
మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సముద్రఖని, సాయి కుమార్, జరినా పోషించనున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి దర్శకులు సుకుమార్, కిశోర్ తిరుమల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్‌తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
-
SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!