Hero Suman Supports Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటికే పవన్ చాలా క్లారిటీగా తన జీవితంలో ఇలా జరగాలని రాసి పెట్టి ఉందని అందుకే జరిగి ఉంటాయని చెప్పుకొచ్చారు. ముందు వారితో పొసగక తాను చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నానని ఆయన అన్నారు. అయితే తాజాగా ఈ విషయం మీద సీనియర్ హీరో సుమన్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా కామెంట్ చేశారు. ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారు రాజకీయాలు చేయకూడదని ఎక్కడైనా చట్టం ఉందా? అని ప్రశ్నించిన ఆయన కొన్ని కారణాల వల్ల వైవాహిక జీవితాలు విచ్ఛిన్నం అవుతాయని, అలాంటప్పుడు మరో వివాహం చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏమిటని సుమన్ ప్రశ్నించారు.
Chandramukhi 2 : నేడు గ్రాండ్ గా జరగనున్న ఆడియో లాంచ్ ఈవెంట్..
తమకు న్యాయం చేయాలని పవన్ మాజీ భార్యలు మిమ్మల్ని అడిగారా? అని ప్రశ్నించిన ఆయన 3 కాకపోతే 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు పవన్ ను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప, వ్యక్తిగతంగా దూషించడం సరికాదని చెప్పారు. అలాగే చిరంజీవిని ఉద్దేశించి కొడాలి నాని చేసినట్టు ప్రచారం జరుగుతున్న పకోడీ వ్యాఖ్యల గురించి కూడా ఆయన స్పందించారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పకోడీ గాళ్లు కాదని, తమను విమర్శించిన రాజకీయ నాయకులే బజ్జీగాళ్లు అని సుమన్ విమర్శించారు. సినిమాలతో రాజకీయ నాయకులకు ఏం పని అని సుమన్ ప్రశ్నించారు. సినీ నటుల రెమ్యునరేషన్లపై మాట్లాడటాన్ని రాజకీయ నాయకులు మానేయాలని సూచించిన ఆయన మా పారితోషికాలతో రాజకీయాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. సినిమా వాళ్లపై వ్యక్తిగత విమర్శలు సరికాదని పేర్కొన్న ఆయన రాజకీయ నాయకుల గురించి ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా టార్గెట్ చేస్తూ ఇటీవల కొందరు మాట్లాడటం తనకు బాధను కలిగించిందన్న సుమన్ రాజకీయాలకు దూరంగా ఉండే రజనీపై ఎందుకు బురద చల్లుతున్నారని మండిపడ్డారు.