Hit3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మితిమీరిన హింస ఉందనే విమర్శలు వచ్చినా.. కలెక్షన్లు బాగానే వచ్చాయి. శ్రీనిధి హీరోయిన్ గా ఇందులో నటించింది. నాని స్వయంగా ఈ మూవీని నిర్మించారు. హిట్ ప్రాంచైజీలో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతున్న ఈ మూవీకి.. ఇప్పట్లో గట్టి పోటీ కూడా లేదు. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు. అయితే ఈ మూవీ థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
Read Also : Preity Zinta: మ్యాక్స్‌వెల్‌తో పెళ్లి.. ప్రీతి జింటా ఫైర్
నెట్ ఫ్లిక్స్ సంస్థ జూన్ 5 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్టు తెలుస్తోంది. విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ. నాని కెరీర్ లో ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. పైగా ఇందులో చాలా వైలెంటిక్ గా కనిపించాడు. గతంలో నాని అంటే క్లాస్ హీరో టాక్ ఉండేది. కానీ ఇప్పటి నుంచి మాస్ సినిమాల్లో కూడా మెప్పిస్తానని ఈ మూవీతో నిరూపించుకున్నాడు. ఈ మూవీకి మరో సీక్వెల్ కూడా రాబోతోంది. అందులో కార్తీ కనిపించబోతున్నాడు.
Read Also : Sri Vishnu : క్రేజీ సెంటిమెంట్ తో హిట్ కొడుతున్న శ్రీ విష్ణు..