దసరా లాంటి కమర్షియల్ హిట్ తర్వాత మరోసారి మాస్ సినిమాల వైపు వెళ్లకుండా కథని మాత్రమే నమ్మి ఫీల్ గుడ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శౌరవ్ డైరెక్షన్ లో నాని ‘హాయ్ నాన్న’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లిమ్ప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్ లో నాని ఉబెర్ కూల్ గా కనిపించాడు. మృణాల్-నానిల పెయిర్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ జంటగా కనిపిస్తున్నారు. సెటిల్డ్ ఎమోషన్ ని కూడా కన్విక్షన్ తో పండించడం నానికి మాత్రమే చెల్లింది. గ్లిమ్ప్స్ చివరలో మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ బిట్ సాంగ్ రిపీట్ మోడ్ లో వినేలా ఉంది.
ఇప్పుడు ఇదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ… హాయ్ నాన్న సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. రేపు రిలీజ్ కానున్న ‘సమయమా’ అనే సాంగ్ ప్రోమోని విడుదల చేసారు. ప్రోమోలో నాని-మృణాల్ చాలా క్యూట్ గా ఉన్నారు. ఈ ప్రోమో సాంగ్ లో మ్యూజికల్ బిట్ అయిపోగానే ‘సమయమా’ అంటూ వచ్చే బిట్ కే రిపీట్ వ్యూస్ పడేలా ఉన్నాయి. ఇక ఫుల్ సాంగ్ బయటకి వస్తే ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ కి సూపర్ స్టార్ట్ దొరికేసినట్లే. మరి జెర్సీ, నిన్ను కోరి వైబ్స్ ని మైంటైన్ చేస్తున్న ‘హాయ్ నాన్న’ సినిమా నానికి పాన్ ఇండియా రేంజులో హిట్ ఇవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మరి డిసెంబర్ 21న నాని ప్రేమ కథతో ఏ స్థాయి హిట్ కొడతాడో చూడాలి.
Tomorrow 🙂#Samayama #SaayaTera #Nizhaliyae #Vivarane #Hridayame#HiNanna pic.twitter.com/zYpkVQ1Kp9
— Nani (@NameisNani) September 15, 2023