Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!

Nani Paradise Speech

Nani Paradise Speech

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేదికపై నాని చేసిన ప్రసంగం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా తన సినిమాపై, దర్శకుడు శ్రీకాంత్‌పై నాని చూపించిన నమ్మకం, బాక్సాఫీస్ వద్ద జరగబోయే విధ్వంసం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా విడుదల గురించి నాని ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 24న కాకుండా, ఒకరోజు ముందే అంటే 23వ తేదీ రాత్రి నుంచే థియేటర్లలో సెలబ్రేషన్స్ మొదలవుతాయని నాని ప్రకటించారు. ఆ రోజు రాత్రి నుంచి థియేటర్లు ఊగిపోతాయని, ఆ యూఫోరియాను మిస్ కాకూడదంటే సింగిల్ స్క్రీన్‌లలోనే సినిమా చూడాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.

తన తమ్ముడు లాంటి దర్శకుడు శ్రీకాంత్ గురించి నాని గొప్పగా మాట్లాడారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ‘ఇన్‌టూ 4 లెవెల్’ (into 4 level) లో కొట్టబోతున్నాడని, అతని పనితనం చూసి శ్రీకాంత్ తల్లిదండ్రులు ఎంతో గర్వపడతారని నాని ధీమా వ్యక్తం చేశారు. “ఇది డైరెక్టర్ సినిమా, మా డైరెక్టర్ మా హీరో” అంటూ శ్రీకాంత్‌ను ఆకాశానికెత్తేశారు. తమను వెనక్కి లాగే నెగిటివిటీని పట్టించుకోబోమని, పాజిటివిటీతోనే ముందుకు వెళ్తామన్న నాని.. “ఇది టీమ్ ప్యారడైజ్ వాద.. ఇది మీ జడల్ గాని వాద” అంటూ థియేటర్లలో తమ సత్తా ఏంటో చూపిస్తామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

సినిమాలోని ఇతర నటీనటుల గురించి నాని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొత్త జనరేషన్‌కు సీనియర్ నటుడు మోహన్ బాబు గారి కటౌట్, సౌండ్, ఇంపాక్ట్ ఏంటో ‘ప్యారడైజ్’ ద్వారా మళ్లీ చూస్తారని చెప్పారు. స్క్రీన్ మీద అంత పవర్‌ఫుల్‌గా కనిపించే మోహన్ బాబు, బయట మాత్రం ఎంతో స్వీట్ పర్సన్ అని కొనియాడారు. ఇక విలన్‌గా నటించిన రాఘవ్ ఈ సినిమాకే హైలైట్ అని, ఇండియన్ సినిమాలో అతనొక బిగ్గెస్ట్ స్టార్ అవుతాడని నాని ప్రశంసించారు.

అలాగే, కష్టమైన పరిస్థితుల్లో కూడా సమ్మక్క లాంటి అద్భుతమైన పాత్రను సోనాలి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా చేశారని, ఆమె రోల్ అందరికీ గుర్తుండిపోతుందని తెలిపారు. సంపూర్ణేష్ బాబును ఫస్ట్ లుక్‌లో ఆ గెటప్‌లో చూసి అందరూ షాక్ అయ్యారని, ఆయన రోల్ కూడా అద్భుతంగా ఉంటుందని అన్నారు. ప్రాణం పెట్టి ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, సెప్టెంబర్ 23 రాత్రి నుంచి బాక్సాఫీస్ వద్ద ప్యారడైజ్ జాతర ఖాయమని నాని తన ప్రసంగాన్ని ముగించారు.