Nandu: సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హస్కీ వాయిస్ తో ఐటెం సాంగ్స్ పాడడంలో ఆమె సిద్దహస్తురాలు. అలా సింగర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టి తనదైన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. గీతామాధురి, హీరో నందు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరికి ఒక పాప కూడా ఉంది. ప్రస్తుతం నందు.. వరుస సినిమాలతో.. ఇంకోపక్క సిరీస్ లతో బిజీగా మారాడు. ఈ మధ్యనే డిస్నీ ప్లస్ హాట్ స్ట్రాల్ లో స్ట్రీమింగ్ అవుతున్న వధువు సిరీస్ లో నందు కీలక పాత్రలో నటించాడు. ఈ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా నందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో సిరీస్ కు సంబంధించిన విషయాలతో పాటు గీతామాధురి గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
” గీతామాధురి, నేను లండన్ వెళ్ళినప్పుడు ఒక పబ్ లో క్యాసినో ఆడాం. ఆ గేమ్ గీతాకు బాగా నచ్చింది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు.. ఆ గేమ్ లో గెలవడానికి చాలా ప్రయత్నించింది. న్యూజిలాండ్, కాలిఫోర్నియా .. ఇలా ఎక్కడకు వెళ్లినా కూడా క్యాసినో ఆడి డబ్బులు పోగొట్టేది. ఒకసారి అలాగే ఈసారి వస్తాయి.. ఈసారి వస్తాయ్ అంటూ ఇంకా గేమ్ ఆడుతుంటే.. నాకు కోపం వచ్చి డబ్బులు అక్కడ విసిరేసి.. నేను బయటకు వచ్చేశా. ఇక నా కోపం చూసిన గీతా.. నా వెనుక వచ్చి సారీ బుజ్జి అంటూ చెప్పుకొచ్చింది. ఆ విషయమై తనను తిడుతుంటే.. అమ్మాయిని రోడ్డు మీద వేధిస్తున్నా అనుకోని పోలిసులు వచ్చి గొడవ చేశారు. ఆ తరువాత మేము ఇద్దరం బార్యాభర్తలం అని రుజువు చేసి అక్కడనుంచి బయటపడ్డాం. ఆ గొడవ తరువాత క్యాసినో ఆడడం గీతా తగ్గించేసింది. ఒకవేళ ఆడినా కూడా రూ. 5- 10 వేలు మాత్రమే పెడుతుంది. ఇక కొన్నిరోజుల నుంచి మేము ఇద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. నా పనుల వలన మేము కలిసి కనిపించలేదు .. అందుకే అలాంటి వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.