టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారిన నందిని ప్రస్తుతం పలు సినిమాలు చేసున్న విషయం విదితమే. ఇక నందిని రెడ్డి కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా ఓ బేబీ. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన విషయం విదితమే.. అప్పటినుంచే సామ్, నందిని రెడ్డిల పరిచయం స్నేహంగా మారింది. అయితే ఎంత స్నేహితులం అయినా మా లిమిట్స్ లో మేము ఉంటామని చచెప్పడంతో ప్రస్తుతం నందిని రెడ్డి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
“సమంత, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. ఓ బేబీ, జబర్ధస్ చిత్రాలతో మేం ఇంకా దగ్గరయ్యాం.. అయితే ఎంత సన్నహితురాలే అయినా తన విషయంలో నేను ఎప్పుడు లిమిట్స్ లోనే ఉంటాను. చైతన్యతో సామ్ ఎందుకు విడిపోయింది అనేది నాకు తెలీదు.. నేను సామ్ ను అడగాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా ఉంటాయి. అవన్నీ ఎదుటువారు తెలుసుకోవాలనుకోకూడదు. సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. నిజం చెప్పాలంటే సెలబ్రిటీస్ గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే నందిని రెడ్డి.. చైతన్యను ఒప్పించి ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. మరి ఆ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలి.