Site icon NTV Telugu

బాలయ్య బాలయ్య.. ఇరగతీసావయ్యా.. ‘అఖండ’పై కళ్యాణ్ రామ్ స్పందన

balakrishna -kalyan ram

balakrishna -kalyan ram

ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ గురించే చర్చ.. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకొని భారీ రికార్డులను కొల్లగొట్టే దిశలో పడిగెడుతుంది. థియేటర్లు ఓపెన్ అయ్యాకా విడుదలై మంచి వసూళ్లు రాబట్టి మిగతా సినిమాలకు అఖండ నమ్మకమనే గేట్లను ఎత్తింది. ఇక ఈ సినిమా విజయంపై టాలీవుడ్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమా చూసిన పలువురు స్టార్ హీరోలు తమ స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఇప్పటికే తారక్.. అఖండ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సైతం బాలయ్యబాబును ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ చేశాడు. “బాలయ్య బాలయ్య…ఇరగతీసావయ్యా.. అఖండను పూర్తిగా ఆస్వాదించాను.. బాబాయ్ ఫుల్ ఫోర్స్ లో ఉన్నారు. ఇండస్ట్రీని పునరుజ్జీవింపజేసే బ్లాక్‌బస్టర్‌ను సాధించినందుకు మొత్తం టీమ్‌కు అభినందనలు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. బోయపాటి- బాలయ్య కాంబోలో సింహ, లెజెండ్ చిత్రాల తరువాత అఖండ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ ని అందుకొంది.

Exit mobile version