Nandamuri Kalyan Ram: 2024 ఎలక్షన్స్ .. తారక్, నేను ఎవరి సైడ్ ఉంటాం అంటే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Kalyan Ram: డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని చవిచూశాడు. ఇక ఏడాది చివరిలో ఎలాగైనా హిట్ అందుకోవాలని డెవిల్ సినిమాతో ప్రేక్షకుల రాబోతున్నాడు. డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్,సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన కళ్యాణ్ రామ్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నాడు.
మునుపెన్నడూ లేని విధంగా ఈసారి కళ్యాణ్ రామ్ కనిపిస్తే.. తన సినిమా కన్నా ఎన్టీఆర్ సినిమా గురించే అభిమానులు అడుగుతున్నారు. అందుకు కారణం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకు కళ్యాణ్ రామ్ నే నిర్మాత. ఇక డెవిల్ తో పాటు దేవర సినిమా గురించిన విషయాలను కూడా పంచుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల గురించి కూడా మాట్లాడాడు. ఏపీ ఎన్నికలు ఈసారి ఎంతో పోటాపోటీగా ఉన్నాయి. ఒకానొక సమయంలో తారక్, కళ్యాణ్ రామ్ టీడీపీ తరుపున ప్రచారం కూడా చేశారు. ఆ తరువాత తారక్ తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని చెప్పడంతో.. అభిమానులు తారక్ ను పొలిటికల్ వ్యవహారాల్లోకి లాగడం లేదు. తాజాగా ఏపీ ఎలక్షన్స్.. ఈసారి చాలా పోటాపోటీగా ఉన్నాయి. మీరు, తారక్ ఏ సైడ్ ఉండబోతున్నారు.. ? లేకపోతే సైలెంట్ గా చూస్తూ ఉంటారా అన్న ప్రశ్నకు కళ్యాణ్ రామ్ స్పందించాడు. ” మేము ప్రస్తుతం ఏ దారిలో వెళ్తున్నా.. అది కుటుంబ విషయం. అది కుటుంబం ద్వారా వచ్చింది. అందుకే.. కుటుంబం మొత్తం ఒక నిర్ణయం తీసుకొని.. తరువాత అందరికి చెప్తాం. కుటుంబం అంటే.. నేను, తారక్. మిగిలినవారు కూడా ఉన్నారు. నా స్టేట్మెంట్ గా ఇది నేను ఇవ్వను.. కుటుంబం మొత్తం ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వాలి. ఇలా ఇస్తే వేరే విధంగా ఉంటుంది. సినిమా అనేది ఒక పర్స్పెక్టీవ్.. ఇది వేరు. మేము ఇద్దరం ఒక నిర్ణయం తీసుకొని అభిమానులకు చెప్తాం” అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
తాజావార్తలు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!