జై బాలయ్య నినాదంతో థియేటర్లు హోరెత్తడానికి మరో రెండు నెలల సమయం ఉంది. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అప్పటి వరకు జై బాలయ్య స్లోగాన్ వినిపించే అవకాశాలు లేవు కానీ ఏ సినిమా రిలీజ్ అయిన సరే.. థియేటర్లో మాత్రం జై బాలయ్య స్లోగాన్ ఉండాల్సిందే. అలాగే బాలయ్య ఏదైనా ఈవెంట్‌కు వస్తే.. జై బాలయ్య నినాదంతో ఆడిటోరియం దద్దరిల్లాల్సిందే. ఇప్పుడు ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని కోసం రంగంలోకి దిగుతున్నాడు బాలయ్య. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘స్కంద’ మూవీ చేస్తున్నాడు రామ్. సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్.
ఈ నేపథ్యంలో… ఆగస్ట్ 26న స్కంద ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు బాలయ్య చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో సోషల్ మీడియాలో జై బాలయ్య ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బోయపాటి, బాలయ్య మధ్య మంచి బాండింగ్ ఉంది. సో బాలయ్య చేతుల మీదుగా ‘స్కంద’ ట్రైలర్ లాంచ్ చేస్తే రీచ్ ఎక్కువగా ఉంటుంది. సినిమా పై మరింత హైప్ రావడం పక్కా కాబట్టి బాలయ్య రాకతో రామ్‌కు నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ ఫుల్లుగా ఉంటుందని చెప్పొచ్చు. ఇది స్కంద ఓపెనింగ్స్‌కు కలిసి రానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన స్కంద రెండు సాంగ్స్ డీజే మోత మోగిస్తున్నాయి. తమన్ ఇచ్చిన మాస్ ట్యూన్స్ అదిరిపోయాయి. మరి స్కందతో రామ్, బోయపాటి పాన్ ఇండియా హిట్ కొడతారేమో చూడాలి.