Nandamuri Balakrishna: తెలుగు ప్రేక్షకులకు హీరోలు అంటే ఎంత అభిమానమో అందరికి తెల్సిందే.. ఇక అందరు హీరోలు వేరు.. బాలకృష్ణ వేరు. అంటే సినిమాల విషయాల్లో కాదు.. ఆయనకున్న క్రేజ్ విషయంలో. అందరితో పోలిస్తే బాలయ్య క్రేజ్ కేవలం తెలుగు స్టేట్స్ కాదు.. దేశం కాదు.. విదేశాల్లో కూడా బాలయ్య స్లోగన్ లేకుండా ఏ పబ్ కానీ, పార్టీ కానీ ముగియదు. బాలయ్య ఒక ఎమోషన్.. బాధ వస్తే జై బాలయ్య అని చెప్పి ఓదార్చాలి.. సంతోషం వస్తే జై బాలయ్య అని పార్టీ చేసుకోవాలి.. ఇలా సందర్భం ఏదైనా జ బాలయ్య కామన్. ఇక ఇప్పుడు ఆ బాలయ్య స్లోగన్ ఎంతవరకు వెళ్లిందంటే.. ప్రతి సినిమాలో జై బాలయ్య స్లోగన్ ఉంటే సినిమా హిట్ అయ్యినట్టే. ప్రతి సినిమలో ఎవరో ఒకరు బాలయ్య ఫ్యాన్స్ గా ఉండడం.. బాలయ్య రిఫరెన్స్ రావడం.. కనీసం జై బాలయ్య అనే స్లోగన్ అయినా వినిపించడం చూస్తూనే ఉన్నాం. అంతలా బాలయ్య ప్రేక్షకులను కట్టిపడేశాడు.
Ram Gopal Varma: ఇండస్ట్రీ షేకింగ్ న్యూస్ .. కల్కిలో ఆర్జీవీ క్యామియో.. ?
తాజాగా.. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కూడా బాలయ్య రిఫరెన్స్ రావడంతో థియేటర్ అంతా జై బాలయ్య స్లోగన్స్ తో మారుమ్రోగిపోయింది. అనుష్క, నవీన్ జంటగా మహేష్ పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇందులో అనుష్క తల్లిగా నటించిన జయసుధ.. బిగ్గెస్ట్ బాలయ్య ఫ్యాన్. అమెరికాలో బాలయ్య ఏ సినిమా వచ్చినా ముందు వెళ్లి.. జై బాలయ్య అని అరుస్తూ సినిమా చూస్తుంది. ఇక అఖండ థియేటర్ షాట్స్ కు వేయడంతో థియేటర్ మొత్తం రచ్చ రచ్చ చేశారు అభిమానులు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో బాలయ్య అభిమానులు సినిమా ఏదైనా.. జై బాలయ్య కామన్ రా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.