యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ దేవర షూటింగ్ జాయిన్ అవనున్నాడు. ఇప్పటికే 80% పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకోని దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఈరోజు నుంచి దేవర కొత్త షెడ్యూల్ ని కొరటాల శివ స్టార్ట్ చేయనున్నాడు. అల్లూమినియమ్ ఫ్యాక్టరీలో 7 రోజుల పాటు దేవర టాకీ పార్ట్ షూటింగ్ జరుగనుంది. మేజర్ కాస్ట్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. ఏ షెడ్యూల్ తర్వాత దేవర సాంగ్స్ షూట్ చేయనున్నారు. ఇంతకుముందే జరగాల్సిన సాంగ్స్ షూటింగ్ డిలే అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ డిలేకి కారణం అనిరుధ్ అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి.
Read Also: Raviteja: ఈగల్ ప్రమోషన్స్ మళ్లీ షురూ… సోలో రిలీజ్ ఇస్తామన్నారు కదా?
ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ ఇప్పటివరకు అనిరుధ్ గురించి వినిపించిన వార్తలని బట్టి చూస్తే అనిరుధ్ మంచి మ్యూజిక్ ఇచ్చినా కూడా కాస్త స్లో గానే వర్క్ చేస్తాడు. తను బాగా టైమ్ తీసుకోని పని చేసే టెక్నీషియన్, ఈ కారణంగా అనిరుధ్ డిలే చేస్తున్నాడు అనే కామెంట్స్ అన్ని ప్రాజెక్ట్స్ విషయంలో వినిపిస్తూనే ఉంటాయి. ఎన్ని కామెంట్స్ వినిపించినా, కాస్త డిలే అయినా ఎండ్ ఆఫ్ ది డే అనిరుధ్ మాత్రం ఆడియన్స్ ని ఫుల్ గా సాటిస్ఫై చేస్తాడు… ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్స్ లేవు. అనిరుధ్ నుంచి సాంగ్స్ రాగానే దేవర సాంగ్స్ షూటింగ్ స్టార్ట్ అవనుంది. ఈ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ లో జాయిన్ అవనున్నాడు. అక్కడ హ్రితిక్ తో కలిసి వార్ 2లో ఎన్టీఆర్ యుద్ధం చేయనున్నాడు.