బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఇటివలే ముగిసింది. కాంటెస్ట్టెంట్స్ వీక్ గా ఉండడంతో సీజన్ 6కి పెద్దగా రీచ్ రాలేదు. కింగ్ నాగార్జున హోస్టింగ్ విషయంలో కూడా మోనాటమీ వచ్చిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. గేమ్ ఆడే ప్లేయర్స్ లో విషయం లేకపోతే నాగార్జున ఏం చేస్తాడు అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వాళ్లకి కౌంటర్ వేస్తున్నారు. అయితే త్వరలో స్టార్ట్ అవబోయే సీజన్ 7కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించట్లేదు అనే రూమర్ గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది. సీజన్ 3 నుంచి నాగార్జుననే బిగ్ బాస్ తెలుగు షోకి హోస్ట్ గా ఉన్నారు. సీజన్ 7లో మాత్రం నాగార్జున ప్లేస్ లో వేరే హోస్ట్ వస్తాడని అంతా అనుకుంటున్నారు. కింగ్ నాగ్ ప్లేస్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
బాలకృష్ణ బిగ్ బాస్ సీజన్ 7కి హోస్ట్ గా చెయ్యడంపై ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకి రాలేదు. కొంతమంది మాత్రం బిగ్ బాస్ తెలుగు ఇనాగ్రాల్ సీజన్ కి హోస్ట్ గా చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, సీజన్ 7కి హోస్ట్ గా తిరిగి వస్తాడని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఉన్న కమిట్మెంట్స్ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 7కి హోస్ట్ గా చెయ్యడానికి ఓకే చెప్పకపోవచ్చు. ఇదే సమయంలో తెలుగులో బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోని సూపర్బ్ గా రన్ చేస్తున్నాడు కాబట్టి బిగ్ బాస్ తెలుగు షో మేనేజ్మెంట్ కూడా బాలయ్యని సీజన్ 7కి హోస్ట్ గా చెయ్యడానికి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని నెటిజన్స్ అనుకుంటున్నారు. రియాలిటీ షోకి బాలయ్య హోస్ట్ గా చేస్తే టీఆర్పి పెరిగే ఛాన్స్ ఉంది అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్, కాంటెస్ట్టెంట్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడియన్స్ కి తెలిసిన ఫేసెస్ ఉంటే షోకి వీకెండ్స్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా మంచి రేటింగ్స్ వస్తాయి.