నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో హిట్ స్ట్రీక్లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ – అఖండ తాండవం చేస్తున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ మసాలా మూవీ కూడా రెడీగా ఉంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు, నందమూరి బాలకృష్ణ త్వరలో రాబోతున్న రెండు బడా ప్రాజెక్టులను తిరస్కరించినట్లుగా తెలిసింది. వాస్తవానికి ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నవే. అందులో మొదటి సినిమా విషయానికి వస్తే, అది రామ్ హీరోగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా. నిజానికి ఈ సినిమాలో ప్రస్తుతం ఉపేంద్ర నటిస్తున్న పాత్ర ముందు బాలకృష్ణను చేయమని అడిగారట. అందుకోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సైతం సిద్ధమయ్యారు మేకర్స్.
Also :Allu Arjun: ఏంటయ్యా ఈ లైనప్..మెంటల్ మాస్ అంతే!
అయితే ఏమనుకున్నారో ఏమో బాలకృష్ణ మాత్రం ఆ పాత్ర చేయలేనని చెప్పారట. తర్వాత ఉపేంద్ర దగ్గరకు వెళ్లి ఆయన్ని సినిమాలో భాగం చేశారు మేకర్స్. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ సీక్వెల్ – జైలర్ 2 సినిమాలో కూడా బాలకృష్ణని నటించమని అడిగినా ఆయన నటించలేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ చేత చేయించాలనుకున్న పాత్ర ఇప్పుడు మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ చేత చేయించేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. నిజానికి బాలకృష్ణ ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయం మీద క్లారిటీ లేదు కానీ, ఆయన రిజెక్ట్ చేసిన విషయం మాత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక గోపీచంద్ మలినేని సినిమా పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ క్రిష్తో ఒక సినిమా పట్టాలెక్కించబోతున్నారు.
