ప్రస్తుతం బాలయ్య ఏపి పొలిటికల్ హడావిడిలో ఉన్నాడు. అందుకే సినిమాల కంటే పొలిటికల్‌గానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. పాలిటిక్స్ గురించి కాసేపు పక్కన పెడితే వచ్చే దసరా బరిలో దూకేందుకు రెడీ అవుతున్నాడు నందమూరి నటసింహం. 2023 సంక్రాంతికి వీరసింహారెడ్డితో వంద కోట్లు కొల్లగొట్టిన బాలయ్య… అంతక ముందు అఖండ సినిమాతో కూడా సెంచరీ కొట్టాడు. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్న బాలయ్య, ఈసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కాకుండా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోకి ఎంటర్ అయ్యాడు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన భగవంత్ కేసరి సాంగ్, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది కానీ ఇంకా ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అవలేదు.
Read Also: Animal: రణబీర్ కపూర్ గీతాంజలిగా రష్మిక!
ఇప్పటికే దసరా బరిలో ఉన్న లియో, టైగర్ నాగేశ్వర రావు ప్రమోషన్స్ పరంగా దూసుకుపోతున్నాయి. కాబట్టి.. త్వరలోనే భగవంత్ కేసరి కూడా రంగంలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో భగవంత్ కేసరి రన్ టైం లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా దాదాపు 2 గంటల 37 నిమిషాలు నిడివి లాక్ చేసుకున్నట్టు సమాచారం. ఓ కమర్షియల్ సినిమాకు ఇది పర్ఫెక్ట్ రన్ టైం అని చెప్పొచ్చు. అయితే ఇంకా సెన్సార్ కాలేదు కాబట్టి… కరెక్ట్ రన్ టైం గురించి ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. కాస్త అటుఇటుగా రెండున్నర గంటల సేపు తెలంగాణ యాసలో బాలయ్య చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పొచ్చు. పైగా అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో థియేటర్ బాక్సులు బద్దలు చేసిన తమన్… ఈసారి అనిల్ రావిపూడి మార్క్ యాక్షన్‌కు దుమ్ముదులపడం గ్యారెంటీ.