Namratha Hinting Gautham Went to NYU for taking Film Course:టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని చిన్నప్పుడు వన్ నేనొక్కడినే సినిమాలో నటించాడు. ఆ తరువాత చదువులో పడి ఇప్పటికే ప్లస్ టూ పూర్తి చేసి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం తన కొడుకు గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మహేష్ భార్య నమ్రత. గౌతమ్ ఇకపై కుటుంబానికి దూరంగా ఉండబోతున్నాడు, న్యూయార్క్ యూనివర్సిటిలో చేరేందుకు వెళ్లుతున్న కొడుకు ఫొటోను షేర్ చేస్తూ కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నందుకు గౌతమ్ కు శుభాకాంక్షలు అంటూ ఆమె పోస్టు పెట్టింది. ‘’నీ హార్డ్ వర్క్, ఫ్యాషన్, సంకల్పం చూస్తుంటే నాకు గర్వంగా ఉందని. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ పేర్కొన్న ఆమె ఇప్పుడు మరో పోస్ట్ పెట్టింది.
Salaar Vs Dunki : ప్రభాస్ ఫ్యాన్స్ పై షారుఖ్ ఫ్యాన్స్ దాడి?
అందులో గౌతమ్ చిన్నప్పటి పిక్ లో నేను ఇండియా, అమెరికాలో పెద్దయి తరువాత యాక్టర్ అవుతానంటున్నట్టు రాసుంది. ఇక అందుకు క్యాప్షన్ గా సుధీర్ఘంగా ఆమె రాసుకొచ్చింది. స్లేట్‌పై రాయడం నుండి వేదికపై స్క్రిప్ట్‌లలు రాయడం వరకు, కలలు – సంకల్పానికి ఒక అందమైన కాంబినేషన్. లైఫ్ స్పాట్‌లైట్‌ను స్వీకరించడానికి ఒక ఫుల్ సర్కిల్ పట్టింది. నువ్వు నీ కోసం ప్లాన్ చేసుకున్న ఈ అద్భుతమైన ప్రయాణంలో నీకు ఆనందం, విజయాలు మాత్రమే రావాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ క్రమంలో నమ్రత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గౌతమ్ ఏం చదవబోతున్నాడు అని కొందరు కామెంట్ చేస్తుంటే ఖచ్చితంగా నటన నేర్చుకోవడానికి వెళ్ళాడు, అందుకే ఆ పిక్ షేర్ చేసింది అని కొందరు అంటున్నారు. అయితే అసలు నిజం ఏమిటో నమ్రత,లేదా మహేష్ పూర్తిగా క్లారిటీ ఇస్తే తప్ప చెప్పలేం.