Nagavamsi: సాధారణంగా నిర్మాతలు అనే కాదు.. సినిమాలో పనిచేసినవారు ఎవరైనా తాము చేసిన సినిమా ప్లాప్ అంటే ఒప్పుకోరు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో అయితే అస్సలు చేయరు. రిలీజ్ అయ్యిన ఒక్కరోజుకే సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తూ మా సినిమా అన్ని రికార్డులు సాధించింది.. ఇన్ని కలక్షన్స్ రాబట్టింది అంటూ చెప్పే నిర్మాతలను చాలామందిని చూసాం.. కానీ నిర్మాతలయందు నాగవంశీ వేరు.. ఏదైనా ముక్కుసూటిగా చెప్పడంలో సూర్యదేవర నాగవంశీ ముందు ఉంటాడు. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో మొహమాటం లేకుండా ఏపీ ప్రభుత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చాడు. ఇక తన సినిమాల విషయంలో ఖచ్చితంగా ఉండే ఈయన సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఒకే రకంగా స్పందిస్తాడు. ఇక తాజగా నాగవంశీ నిర్మిస్తున్న చిత్రాలలో సార్ ఒకటి. ధనుష్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగవంశీ తన సినిమాల గురించి నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు.
Read Also: Pavitra: మా నాన్న చనిపోయాడని తెలిసి సంతోషించా.. జబర్దస్త్ నటి సంచలన వ్యాఖ్యలు
మీ సినిమాల్లో ఏ సినిమా చూసి మీరు ముందే ప్లాప్ అవుతుందని అనుకున్నారు అన్న ప్రశ్నకు నాగవంశీ తడుముకోకుండా బుట్టబొమ్మ అని చెప్పుకొచ్చేశాడు. ” స్క్రిప్ట్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నా కానీ మేకింగ్ చూసాకా బుట్టబొమ్మ ప్లాప్ అవుతుందని నాకు, త్రివిక్రమ్ కు ముందే తెలుసు. మూడేళ్ళ క్రితమే ఈ మూవీ రైట్స్ తీసుకొని మంచి కథగా తీర్చిదిద్ది ప్రేక్షకులకు చూపించాలనుకున్నాం.. కానీ ఆ సినిమా బయటికి రావడానికి ఇంత సమయం పట్టింది. ఒక పదహారేళ్ళ కొత్త అమ్మాయి కథను థియేటర్ కు వెళ్లి చూడాలని ప్రేక్షకులు ఎవరు కోరుకోరు. మేకింగ్ అంతా అయిపోయి.. సినిమా రిలీజ్ కు పదిరోజులు ఉంది అనగా సినిమా చూసిన త్రివిక్రమ్, నేను సినిమా ప్లాప్ అయ్యిందనే అనుకున్నాం.. కానీ, రిలీజ్ డేట్ ప్రకటించేసి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసరికి ఏమి చేయలేక థియేటర్ లోనే సినిమాను రిలీజ్ చేశాము” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగవంశీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.