తన కో స్టార్ట్స్ వెంకీ, బాలకృష్ణ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే, కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. 2022లో వచ్చిన బంగ్రారాజు తర్వాత పెద్దగా హిట్ చూడలేదు. బ్రహ్మాస్త ఉన్నప్పటికీ అది రణబీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్, నా సామి రంగా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్‌కు షిఫ్టయ్యారు కింగ్.
Also Read : Tollywood : టాలీవుడ్ లో నయా ట్రెండ్.. ప్లాప్ సినిమాలకు భారీ సక్సెస్ మీట్లు..
రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్ కూలీలో సైమన్ గా అలాగే ధనుష్- శేఖర్ కమ్ముల దర్శత్వంలో వస్తోన్న కుబేరలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో కింగ్ ఈజ్ బ్యాక్ కానున్నాడని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత నాగ్ ఎవరితో వర్క్ చేస్తాడో అన్న క్లారిటీ రాలేదు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం మరోసారి తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడట కింగ్ నాగార్జున. హిట్ 3 తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో నాగార్జున చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ శైలేష్ విక్టరీ వెంకటేశ్‌తో చేయాలని ఇంట్రస్ట్ చూపుతున్నాడు. దీంతో నాగ్- శైలేష్ కొలబరేట్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇప్పటికే 95 ప్లస్ చిత్రాలు కంప్లీట్ చేసిన అక్కినేని వారసుడు తన మైల్ స్టోన్ మూవీ కోసం మరోసారి తమిళ దర్శకుడిని నమ్ముకున్నట్లు టాక్. తన 100వ సినిమా కోసం కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ రా కార్తీక్‌తో పెయిర్ అప్ కాబోతున్నాడట. బైలింగ్వల్ మూవీ ఆకాశంతో ఓకే అనిపించుకున్నాడు కార్తీక్. అయితే చెప్పుకోదగ్గ హిట్ మూవీ కాదు. మరీ అలాంటి దర్శకుడికి నాగ్ ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.