Tollywood : టాలీవుడ్ లో నయా ట్రెండ్.. ప్లాప్ సినిమాలకు భారీ సక్సెస్ మీట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. వాస్తవానికి ఇది ఎప్పటి నుండో ఉంది కానీ ఇటీవల మరి ఎక్కవయింది. అదే సక్సెస్ మీట్.. థాంక్యూ మీట్.. గ్రాటిట్యూడ్ మీట్. ఇలా పేరు ఏదైనా అర్ధం ఒకటే. ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు సక్సెస్ మీట్స్ చేసే వాళ్ళు నిర్మాతలు. మరి సూపర్ హిట్ అయితే అర్ధశతదినోత్సవ వేడుకలు ఇలా రన్ ని బట్టి చేసే వాళ్ళు..
Also Read : NTRNeel : ఎన్టీఆర్ – నీల్ ఫస్ట్ షెడ్యూల్ ముగించారు
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
కానీ ఇప్పుడు ప్లాప్ సినిమాలకు కూడా సక్సెస్ మీట్స్ పెట్టిస్తున్నారు మేకర్స్. మ్యాట్నీ షోస్ క్యాన్సిల్ అయిన సినిమాలకు కూడా సక్సెస్ మీట్స్ పెట్టి ఆహా.. ఓహో అని ఉదరగోతున్నారు. అసలు సక్సెస్ అంటే నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి వెనక్కి రాబట్టడం. మరి అలా సక్సెస్ అయినా సినిమాలు ఏవంటే వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. దానికి తోడు పోస్టర్ పిచ్చి కూడా బాగా పెరిగిపోయింది. ఆ మధ్య ఓ హీరో నటించిన సినిమాకు రూ. 100 కోట్లు పోస్టర్ వేశారు. కానీ ఆంధ్రలో మూడు ఏరియాలు నష్టాలు.. రెండు ఏరియాలు ఖర్చులు తో సరిపెట్టుకుంది. ఇక మరోక పాన్ ఇండియా సినిమా అయితే మొదటి రోజే వందల కోట్ల పోస్టర్ రిలీజ్ చేసి నవ్వుల పాలైంది. గత నెల రిలీజ్ అయిన యంగ్ హీరో సినిమా ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ కానీ రెండవ రోజు థియేటర్స్ ఖాళీ. కట్ చేస్తే సక్సెస్ మీట్ లో బ్రేక్ ఈవెన్ అయిందని హీరో స్వయంగా ప్రకటనలు. రాను రాను ఈ సక్సెస్ మీట్స్ కామెడీ మీట్స్ అయ్యేలా ఉంది. ఇక ఈ రోజు విడుదల కావాల్సిన ఓ సినిమా ప్రేస్ మీట్ ను భారీ ఎత్తున చేయాలనీ చూసి ఏవో కారణాలతో క్యాన్సిల్ చేసారు. కారణం ప్రీమియర్స్ లో ఈ సినిమాకు బాగా బ్యాడ్ టాక్ వచ్చింది. ఇక మరో స్టార్ అయితే సక్సెస్ మీట్ లో మా సినిమా సూపర్ హిట్ అని స్పీచ్ అదరగొట్టారు. రియాలిటీ ఏంటంటే గుంటూరు, కృష్ణ, ఈస్ట్, వెస్ట్ లో నష్టాలు తప్పవట. ఇలా ఒకటేమిటి అన్ని సినిమాలది ఇదే పరిస్థితి. అయినా సరే భారీ సక్సెస్ మీట్లు, కేక్ కటింగ్స్ మాత్రం షరా మాములే. బహుశా సినిమా రిలీజ్ అయింది కదా అదే సక్సెస్ అని మేకర్స్ ఉద్దేశమేమో.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!