Akkineni Nagarjuna: ఈ ఉగాదికి వస్తున్నాం.. రీమేక్ మొదలుపెడుతున్నాం అంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: టాలీవుడ్ సీనియర్ హీరోలు ఈ వయస్సులో కూడా చేతిలో రెండు మూడు సినిమాలకు తగ్గకుండా లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు పోటీఇస్తున్నారు. చిరు, బాలయ్య, వెంకీ మామ.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే అక్కినేని నాగార్జున మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా రిలీజ్ కాదు కదా కనీసం ప్రకటించకపోవడం అక్కినేని అభిమానులను కలవరపరుస్తోంది. గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. ఎవరు ఎంత మాట్లాడిన నాగ్ మాత్రం మౌనమే సమాధానమంటూ దాటేస్తూ వచ్చాడు. అయితే అందుకు కారణం.. నాగ్ రీమేక్ చేయాలనుకుంటున్న సినిమా రైట్స్ విషయంలో కొద్దిగా అవకతవకలు జరగడమే. అవును.. నాగ్.. ఒక మలయాళ సినిమాను రేంక్ చేయాలనుకుంటున్నాడు. అదే.. పోరింజు మరియమ్ జోస్.
Aishwarya Rajinikanth: ధనుష్ మాజీభార్య ఇంట్లో దొంగతనం.. లక్షల్లో నగదు మాయం
Also Read
మలయాళ నటుడు జోజు జార్జ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నాగ్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకుడిగా మారనున్నాడు. ఇకపోతే గత కొన్నిరోజులుగా ఈ సినిమా రైట్స్ కొనుగోలు విషయంలో జరిగిన జాప్యం వలనే నాగ్ సినిమా పట్టాలెక్కలేదట. ఇక ఈ మధ్యనే ఈ సమస్య తీరిపోవడంతో నాగ్.. తిరిగి సెట్ మీదకు వెళ్లడానికి సిద్దమయ్యాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారట. ఇదే కనుక నిజమైతే ఉగాది నాడు అక్కినేని అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. దీంతో నాగ్ అభిమానులు ఈ ఉగాదికి వస్తున్నాం.. రీమేక్ మొదలుపెడుతున్నాం అంతే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ రీమేక్ తో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!