Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగచైతన్య తన గురించి ఎంతో ప్రేమగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సక్సెస్ కేవలం ఒక సినిమాకే పరిమితం కాదని, మొత్తం టీమ్ కష్టానికి దక్కిన గౌరవమని అన్నారు. సినిమా సక్సెస్‌ను పంచుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఒకే వేదికపై సత్కరించడం చాలా ఏళ్ల తర్వాత జరుగుతోందని పేర్కొన్న ఆయన.. అలాంటి వేడుక మళ్లీ జరగడం తనకు ఎంతో నోస్టాల్జిక్గా అనిపించిందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు హౌస్‌ఫుల్ షోలు, అదనపు షోలు పెరుగుతున్నాయని చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.
సినిమా రూపుదిద్దుకోవడంలో రచయిత సత్యానంద్ చేసిన సహకారం ఎంతో విలువైనదని నాగార్జున ప్రత్యేకంగా ప్రస్తావించారు. కథ విన్న తర్వాత దర్శకుడిని ఆయన వద్దకు పంపించానని, స్క్రిప్ట్‌ను మరింత బలంగా తీర్చిదిద్దడంలో సత్యానంద్ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. అలాగే రామజోగయ్య శాస్త్రితో పాటల గురించి జరిగిన చర్చలు కూడా సినిమాకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌పై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చివరి నిమిషంలో పూర్తి కాపీ అందించినప్పటికీ అత్యుత్తమ నాణ్యతతో అవుట్‌పుట్ ఇచ్చారని కొనియాడారు. అయితే భవిష్యత్తులో దర్శకులు, నిర్మాతలు సినిమాలను కనీసం రెండు వారాల ముందే పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌కు అందించాలని సూచించారు. అలా చేస్తే సినిమా నాణ్యత మరింత మెరుగవుతుందని, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని అన్నారు. తాను కూడా గతంలో రిలీజ్ డేట్లు ప్రకటించి సాంకేతిక కారణాలతో వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్న నాగార్జున.. ఆ అనుభవం వల్లే ఇప్పుడు ఈ సూచన చేస్తున్నానన్నారు. మంచి సినిమా కోసం సమయం కేటాయించడం అవసరమని, మొత్తం పరిశ్రమ ఈ దిశగా ఆలోచించాలని కోరారు.
Also Read
- Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
- Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
- Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
సినిమాలో నటించిన వసంత్‌తో పాటు ప్రతి నటుడు, ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా పనిచేశారని నాగార్జున అభినందించారు. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ టీమ్ రాయలసీమ వాతావరణాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించిందని ప్రశంసించారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో పనిచేశారని, అదే ప్రేమను ప్రేక్షకులు కూడా తిరిగి చూపించారని అన్నారు. అఖిల్ గురించి మాట్లాడిన నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. అభిమానుల నుంచి వినిపిస్తున్న అరుపులు, చప్పట్లు కోసం అఖిల్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడని తెలిపారు. ఇప్పుడు ప్రేక్షకుల ప్రేమను చూసి తమ ఇంట్లో నిజంగా పండగ వాతావరణం నెలకొందని అన్నారు. ఈ విజయాన్ని తమ కుటుంబం ఎంతో ప్రత్యేకంగా భావిస్తోందని చెప్పారు. చివరగా సోషల్ మీడియా రివ్యూల కంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌నే తాము ఎక్కువగా నమ్ముతామని నాగార్జున అన్నారు. అదనపు షోలు వేస్తున్నామని, హౌస్‌ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయని చెప్పిన ప్రతి ఫోన్ కాల్ తమకు నిజమైన ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ప్రేక్షకులు ‘లెనిన్’ సినిమాపై చూపించిన ఆదరణకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!