పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ “జయమ్మ పంచాయితీ” విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సుమ మూవీకి స్టార్ సపోర్ట్ బాగా లభిస్తోంది. ఇంతకుముందు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకోగా, మరో ఇద్దరు స్టార్ హీరోలు సుమ కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ చిత్రం మే 6న విడుదలకు సిద్ధమవుతుండగా, ఈరోజు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ మేరకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతుండగా, గెస్టుల పేర్లు రివీల్ చేశారు. “జయమ్మ పంచాయతీ”కి నాగార్జున, నాని హాజరు కాబోతున్నారు.
Read Also : Mega154 : టైటిల్ లీక్ చేసిన మెగాస్టార్
ఇక ఇప్పటికే విడుదలైన “జయమ్మ పంచాయతీ” టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఈ మూవీని వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించారు. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. బలగ ప్రకాష్ నిర్మిస్తున్న విలేజ్ డ్రామా ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.