Akkineni Nagarjuna: గ్రీకు వీరుడు.. నా రాకుమారుడు.. కళ్ళలోనే ఇంకా ఉన్నాడు.. ఈ పాటను ఎవరు మర్చిపోలేరు. ప్రతి అమ్మాయి తన కలల రాకుమారుడి కోసం పాడుకుంటూనే ఉంటుంది. ఇక ఆ రాకుమారుడు మన మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి నాగ్ కు మన్మథుడు ట్యాగ్ ఉంది. ఏ హీరోయిన్ అయినా నాగ్ అందానికి ఫిదా కావాల్సిందే. ఇక అమల కూడా అలా ఫిదా అయ్యే నాగ్ ను కొంగున ముడివేసుకుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. నాగ్ ప్రియురాలిగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది హీరోయిన్ టబు. నాగ్ మీద ఉన్న ప్రేమతోనే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని చెప్పుకొస్తారు. అయితే అందులో ఎటువంటి నిజం లేదని, తనకు, టబుకు మధ్య ఉన్న బంధం అందరు అనుకున్నట్లు కాదని, ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అని నాగ్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. అమల సైతం వీరిద్దరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
Ant-Man and the Wasp: Quantumania Movie Review: యాంట్ మేన్ అండ్ ద వాస్ప్: క్వాంటమేనియా (English)
తాజాగా ఈ ముగ్గురు కలిసి ఎంజాయ్ చేస్తున్న ఒక రేర్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫొటోలో అమల, టబుల మధ్య నాగ్ నవ్వులు చిందిస్తూ ఉన్నాడు. అమల బ్లూ కలర్ డ్రెస్ నాగ్ ను ముందు నుంచి కౌగిలించుకోగా.. రెడ్ కలర్ డ్రెస్ లో టబు వెనుక నుంచి నాగ్ ను హత్తుకుంది. అయితే ఈ ఫోటో ఏ సమయంలో తీసుకున్నారు అనేది తెలియదు. నిన్నే పెళ్లాడతా సినిమాతో టబును నాగ్ తెలుగుతెరకు పరిచయం చేశాడు. అప్పటినుంచి వీరిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పటికి ఆ ఫ్రెండ్షిప్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ వస్తే టబు.. నాగ్ వాళ్లింట్లోనే ఉంటుంది. ఈ ఒక్క విషయం సరిపోదా వీరి ఫ్రెండ్షిప్ ఎలాంటిదో అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.