Naga Chaitanya: అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగ చైతన్య. హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక కోరుకున్న ప్రేయసి సమంతను వివాహమాడి అందరి మన్ననలు పొందాడు. నాలుగేళ్ళ తరువాత భార్య సమంతకు విడాకులు ఇచ్చి హాట్ టాపిక్ గా మారాడు. విడాకుల తరువాత కూడా మాజీ భార్యను ఒక్క మాట కూడా అనకుండా నెటిజన్ల ప్రేమను అందుకున్నాడు. ప్రస్తుతం కెరీర్ ను బిల్డ్ చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్న చైతూ ఇటీవలే లాల్ సింగ్ చద్దా చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా చైతూకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని తెలుస్తోంది.
ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. సమంత తో విడాకుల తరువాత కొద్దిగా చైతూ లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. నేతకు ముందు తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అవ్వని ఈ హీరో ఇటీవల మొహమాటం లేకుండా తానా మనసుకు నచ్చిన విధంగా సమాధానాలు చెప్తున్నాడు. యాంకర్ మాట్లాడుతూ తాను బాంద్రా రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయిని ముద్దాడుతూ పోలీసులకు దొరికిపోయానని చెప్పుకొచ్చాడు. దీంతో చైతూ తాను కూడా ఒక అమ్మాయిని ముద్దాడుతూ పోలీసులకు దొరికిపోయినట్లు చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. “కాలేజ్ రోజుల్లో నా కారు బ్యాక్ సీట్ లో నా గర్ల్ ఫ్రెండ్ ను ముద్దు పెట్టుకుంటుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాను. అప్పుడు నాకు అది తెలిసే జరిగింది. ఇలా చెప్పడానికి నేను సిగ్గుపడడం లేదు. ఎందుకంటే అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు.” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సీక్రెట్ నెట్టింట వైరల్ గా మారింది.