Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కార్తీక్ దండుతో భారీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. అయితే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రానా హోస్ట్ గా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఇందులో నీ తొలి ముద్దు ఎవరికి ఇచ్చావ్ అని రానా అడగడంతో నిర్మొహమాటంగా చెప్పేశాడు చైతూ. నేను 9వ క్లాస్ లో ఉన్నప్పుడే ఓ అమ్మాయికి ముద్దు ఇచ్చా అంటూ చెప్పేశాడు.
Read Also : Heros : అన్నలు సక్సెస్.. తమ్ముళ్లకు ఏమైంది..?
ఆ అమ్మాయిని నేను డీప్ గా లవ్ చేశాను. ఆమెకు ముద్దు కూడా ఇచ్చాను. ఆ ముద్దు నా లైఫ్ మొత్తం పనిచేసింది. కానీ ఆమె నా లైఫ్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యాడు నాగచైతన్య. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూలిపాళ్లను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చైతూ.
Read Also : Baahubali Epic : రీ రిలీజ్ లోనూ టాప్ హీరోలకు బాహుబలి చెక్.. ఏంట్రా ఈ క్రేజ్..
