Naga Babu: అన్నయ్య బర్త్ డే రోజు.. ఆయనకే తెలియని విషయం చెప్తా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Babu: ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. ఈనెల 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా మెగా గ్రాండ్ కార్నివల్‌ను నిర్వహిస్తున్నట్లు నాగబాబు స్పష్టం చేశారు. 20 ఏళ్లకు పైగా మెగా అభిమానులు చూపించే ఆదరాభిమానాలను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్లు నాగబాబు తెలిపారు. తెలుగులో చెప్పాలంటే ఇదొక జాతర మాదిరిగా ఉంటుందన్నారు. గోవా కార్నివల్, బ్రెజిల్ కార్నివల్ రేంజ్లో కాకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా అభిమానుల కోసం కార్నివల్ ఏర్పాటు చేస్తున్నామని.. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క మెగా అభిమాని తరలిరావాలని ఆహ్వానం పలికారు.
Read Also: Puri Jagannath: ఛార్మితో ఎఫైర్.. ఎట్టకేలకు నిజం చెప్పిన పూరి
Also Read
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
ఈ వేడుకల్లో పాల్గొనాలని భావించే అభిమానులకు పాసులు జారీ చేస్తామని.. ఈ పాసులను ఈనెల 19 నుంచి బ్లడ్ బ్యాంక్, అభిమాన సంఘాల వద్ద తీసుకోవచ్చని నాగబాబు సూచించారు. ఈ ఏడాది చిరంజీవి బర్త్ డే వేడుకలు డిఫరెంట్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే మెగా గ్రాండ్ కార్నివల్ నిర్వహిస్తున్నామని.. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ హాఉరవుతారని నాగబాబు తెలిపారు. ఈ ఈవెంట్‌కు తరలివచ్చే అభిమానుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్లాన్ చేశామని.. ఫుడ్ స్టాళ్లు కూడా ఉంటాయన్నారు. ఈవెంట్ రోజు తాను మూడు, నాలుగు నిమిషాలు మాట్లాడతానని.. ఈ సందర్భంగా ఎవరికీ తెలియని ఓ విషయాన్ని చెప్తానని.. బహుశా ఈ విషయం అన్నయ్యకు కూడా తెలియదని.. థర్డ్ సోర్స్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నానని.. అన్నయ్య బర్త్ డే రోజు ఈ విషయాన్ని చెప్తానని నాగబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!