Nadiya : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్ర చేసిన నదియా అందరికీ గుర్తే. ఈ సినిమానే కాదు ఎన్నో సినిమాల్లో హీరోయిన్లకు తల్లి పాత్రలో మెరిసింది. ఒకప్పుడు ఆమె హీరోయిన్ కూడా. కాగా ఆమె ఇంటర్ లో ఉన్నప్పుడే ఇంటి ఎదురుగా ఉండే శిరీష్ తో ప్రేమలో పడింది. దాంతో ఆమె సినిమాల్లోకి వెళ్లాలి అనే ఆలోచనను పక్కన పెట్టేసి శిరీష్ తో పీకల్లోతు ప్రేమలో మునిగింది. తర్వాత నదియా మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా బిజీ అయింది.
Read Also : Ram Charan : ప్రధాని మోడీని కలిసిన రామ్ చరణ్ దంపతులు
అదే టైమ్ లో శిరీష్ అమెరికాలో ఉద్యోగం తెచ్చుకుని అక్కడ సెటిల్ అయిపోయాడు. అయినా సరే శిరీష్ తో ఆమె ప్రేమాయణం ఆపలేదు. ఇప్పట్లోలాగా సెల్ ఫోన్లు, సోషల్ మీడియా అప్పుడు లేవు. టెలిగ్రామ్ ద్వారా ఇద్దరూ ప్రేమించుకునేవారు. అయితే ఆమె హీరోయిన్ గా ఎదిగిన తర్వాత ఇంట్లో వారు పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేశారు. దాంతో నదియా తన మనసులో మాట చెప్పి శిరీష్ ను పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఇంకేముంది పెద్దలను ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం పాటు ఆమె అమెరికాలోనే ఉండిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భర్త సపోర్టుతో సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది.
Read Also : Pooja-Hegde : హీరోల లాగా హీరోయిన్లకు మర్యాద ఇవ్వరు.. పూజాహెగ్దే కామెంట్స్
