Nabha : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ ఒక చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ హృదయస్పర్శిగా ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకృతి గురించి నభా ఒక అద్భుతమైన సందేశాన్ని అందించిందని నెటిజన్లు కామెంట్స్ ద్వారా ప్రశంసిస్తున్నారు.
Read Also : Kingdom : అబ్బే.. ఆ వార్తలన్నీ ఒట్టిదే!
తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో నభా ఇలా రాసింది: “ఈ రోజు నేను ఒక చెట్టును కౌగిలించుకున్నాను… ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకున్నట్లు అనిపించింది. ఈ అందమైన ప్రపంచాన్ని ఆస్వాదించడానికి మనం కేవలం అతిథులం. ప్రకృతి మనకు అనేక అద్భుత అనుభవాలను అందిస్తోంది. ఈ పర్యావరణాన్ని, ప్రకృతిని అనుభవించడమే మన హక్కు. ఈ సంతోషాన్ని, అనుభూతిని అందించిన నేచర్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.”
ప్రస్తుతం నభా నటేష్ పలు ఆసక్తికరమైన సినిమాల్లో నటిస్తోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభుతో పాటు, మరో ప్రతిష్టాత్మక చిత్రం నాగబంధంలో కూడా ఆమె నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు పాన్-ఇండియా స్థాయిలో భారీగా రూపొందుతున్నాయి. త్వరలో స్వయంభు మరియు నాగబంధం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవి కాకుండా, నభా లైనప్‌లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి, ఇవి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Read Also : Murder Mystery : బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్ హత్య కేసు చేధించిన పోలీసులు..