సంక్రాంతికి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసాడు అనిల్ రావిపూడి. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సూపర్ హిట్స్ కాగా ఇప్పుడు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ నమోదు చేసింది.ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ ను కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి కథ వినిపించడం అందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం చక చక జరిగాయి.
Also Read : Krithi Shetty : బేబమ్మ.. నీ కళ్ళు నీలి సముద్రం.. నీ నవ్వు ముత్యాల హారం..
ఇటీవల వైజాగ్ లో డైలాగ్ వర్షన్ కూడా ఫినిష్ చేసాడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు అధికారకంగా ప్రకటించని ఈ సినిమాను అనౌన్స్ చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేసారు. ఈ నెల 30న అనగా నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా చిరు – అనిల్ సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టనున్నరు. హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా రానున్నారు. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరు సరనస హీరోయిన్ గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి ఇంకా ఎవరని ఫిక్స్ చేయలేదు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్ బైనర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.