MS Chowdhary: చాలామంది చిన్న చిన్న నటులకు ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు రాదు.ఇక వారికి ఒకసారి గుర్తింపు వచ్చింది అంటే.. ఆపడం ఎవరితరం కాదు. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ఇండియా వైడ్ భారీ హిట్ కొట్టి ఏకంగా 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తన సత్తా చాటాడు. ఇక ఈ సినిమా ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ కూడా సలార్ అదరగొడుతుంది. ఈ సినిమాలో నటించిన చిన్న చిన్న నటులకు ఎంతో గుర్తింపు వచ్చింది. అలా సలార్ లో నారంగ్ పాత్ర చేసిన ఎమ్మెస్ చౌదరి ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. అతను ఎక్కడ కనిపించినా.. సలార్ నారంగ్ అని పిలుస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా అతను ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి, నారంగ్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
సలార్ సినిమా మొత్తంలో దేవాను కొట్టే పాత్ర ఏదైనా ఉంది అంటే అది నాదే. ఈ సీన్ చేసినప్పుడు మూడు యాంగిల్స్ లో షూట్ చేద్దామని చూస్తున్నారు. మూడుసార్లు ప్రభాస్.. నా కాళ్లు పట్టుకోవాలి. అప్పుడు ప్రభాస్ డూప్ వచ్చి నేను చేస్తా అని అన్నాడు. కానీ, డూప్ వద్దు అని ప్రభాసే నా కాళ్లు పట్టుకున్నాడు. సలార్ అయిపోయాక ప్రభాస్ బెంగళూరులో పార్టీ ఇచ్చాడు. నేను కూడా ఆ పార్టీకి వెళ్లాను. సాధారణంగా నేను హీరోలను పలకరించను. ఎందుకంటే వారిని డిస్ట్రబ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా వెళ్లి హీరోలతో మాట్లాడితే.. వారు విసుక్కుంటూ ఉంటారు. ప్రభాస్ తో కూడా నేను చాలా తక్కువ మాట్లాడాను. కానీ, ఆయన చాలా సరదా మనిషి, ఎంతో సింపుల్ గా ఉంటాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.