MS Chowdhary: చాలామంది చిన్న చిన్న నటులకు ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు రాదు.ఇక వారికి ఒకసారి గుర్తింపు వచ్చింది అంటే.. ఆపడం ఎవరితరం కాదు. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ఇండియా వైడ్ భారీ హిట్ కొట్టి ఏకంగా 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తన సత్తా చాటాడు.