Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur: ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో మృణాల్ ఠాకూర్ పేరు మారుమోగుతోంది. ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ, తాజాగా ఒక పెళ్లి వేడుకలో చేసిన డ్యాన్స్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచారు. తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్లిలో మృణాల్ మాస్ డ్యాన్స్ (వైరల్ వీడియో) ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల తన స్నేహితురాలు (విదుషి పరాశర్) వివాహ వేడుకలో మృణాల్ సందడి చేశారు.

ఈ పెళ్లి రిసెప్షన్‌లో దిల్జిత్ దోసాంజ్ పాడిన ప్రసిద్ధ పాట “లవర్” కు మృణాల్ ఎంతో ఉత్సాహంగా, గ్రేస్‌ఫుల్‌గా డ్యాన్స్ చేసి రచ్చ చేశారు. ఈ రిసెప్షన్‌లో ఆమె వేసిన స్టెప్పులు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే మృణాల్ తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. సీతా రామం సినిమాతో ఆమెకు వచ్చిన క్లాసిక్ ఇమేజ్ ఆమెకు భాషలకు అతీతంగా స్టార్‌డమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత హాయ్ నాన్న చిత్రంతో తన యాక్టింగ్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ, నేటి తరం హీరోయిన్లలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తానికి, వెండితెరపై తన నటనతోనూ, బయట తన సరదా చేష్టలతోనూ మృణాల్ ఠాకూర్ అభిమానులను అలరిస్తూ ఉన్నారు.