Mrunal Thakur: సీతారామం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. సీరియల్స్ నుంచి సినిమా వరకు ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఒక్క సీత పాత్రతో ఆమెకు ప్రపంచం మొత్తం అభిమానులుగా మారిపోయారు. ఈ చిత్రంలో సీతగా ఆమె నటనను అభిమానులు అంత త్వరగా మర్చిపోరు. ఇక ఆ క్యారెక్టర్ ను, మృణాల్ ను తెలుగు అభిమానులు ఎంతగా ఓన్ చేసుకున్నారంటే.. మృణాల్ మోడ్రన్ డ్రెస్ లో కనిపిస్తే చాలు తిట్టిపోసేస్తున్నారు. ఇక తెలుగువారి అభిమానానికి ముగ్దురాలైన మృణాల్.. పొట్టి బట్టలు వేసుకోవడమే మానేసింది.
ఒంటినిండా బట్టలు కప్పుకొని మీడియా ముందు కనిపించింది. ఇక ఇన్నిరోజులు తర్వాత ఈ ముద్దుగుమ్మ బ్యాక్ తో ఫెవిలియన్ అంటూ మోడ్రన్ డ్రెస్ లో మెరిసిపోయింది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో మృణాల్ ఎంతో అందంగా కనిపించింది. ఈ డ్రెస్ మరీ అంత ఎబ్బెట్టుగా అయితే ఏం లేకపోవడంతో నెటిజన్లు సైతం ఆమె అందానికి ఫిదా అవుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే మృణాల్ సీతారామం తరువాత తెలుగులోఎవరితో సినిమా చేయనుంది అని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఆ లక్కీ హీరో ఎవరో చూడాలి.