NTV Telugu Site icon

Simbaa : జగపతిబాబు, అనసూయల ‘సింబా’ ట్రైలర్ టాక్..!

Untitled Design (33)

Untitled Design (33)

జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ, అలనాటి హీరోయిన్ గౌతమి కీల‌క పాత్ర‌లు పోషించిన చిత్రం సింబా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించి సింబా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ప్రపంచంలో సిగరెట్లు, మందు కంటే గాలి కాలుష్యం కారణంగా 25% ఎక్కువ చనిపోతున్నారనే వార్నింగ్ ఇస్తూ, చెట్ల‌ని పెంచండి ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించండి అనే మెసేజ్ ఇస్తూ చెట్ల‌ని కాపాడుకోవాల్సిన అవ‌స‌రాన్ని చెప్పే టీచర్ గా, వరుస హత్యల వెనక ఓ లేడీ ఉన్నట్టు ఆమె అనసూయ అనేలా ఆమె పాత్ర చూపించారు. దాని చుట్టూ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, స‌స్పెన్స్, కొన్ని యాక్షన్ ఘట్టాలు, అక్కడక్కడ కొన్ని నవ్వులు, సామాజిక అంశానికి, ఆస‌క్తిక‌ర‌మైన క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి టీజర్ కట్ చేసారు మేకర్స్.

కాగా ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ అనసూయను విజయ్ దేవరకొండ వివాదం గురించి ప్రశ్నించగా అన‌సూయ మాట్లాడుతూ “విజ‌య్ స్టేజ్ మేన‌ర్స్ పైనే అప్పుడు గొంతు విప్పాను, లైమ్ లైట్ లో ఉన్న‌ప్పుడు ఎవరైనా సరే ప‌ద్ధ‌తిగా ఉండాలి, అందుకోసమే మాట్లాడాల్సివ‌చ్చింది, నిజానికి ఇది మీడియా బాధ్య‌త అని, మీడియా మాట్లాడ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆరోజు స్పందించాల్సివ‌చ్చింది, అయితే ఈ ఇష్యూతో నేను కొంత నేర్చుకున్నాను, చెప్పాల్సిన విష‌యాన్ని స‌రిగ్గా క‌న్వే చేస్తే బాగుండేది, ఇప్పుడు విజయ్ తో ఎటువంటి ఇష్యూ లేదు” అని అనసూయ తెలిపింది. సంపత్ నంది కథ అందించిన సింబా చిత్రానికి మురళి మనోహర్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది, రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సింబా ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

Also  Read: Tamil cinema: ఆగస్టు రేసులోకి మరో సినిమా..రిలీజ్ ఎప్పుడంటే..?

 

Show comments