బాలీవుడ్ దర్శకుల ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డికె నిర్మిస్తున్న తెలుగు చిత్రం ‘సినిమా బండి’. ప్రవీణ్ ప్రవీణ్ కంద్రెగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఒక షేర్ ఆటో డ్రైవర్ కు తన ఆటోలో ఒక ఖరీదైన కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో ఆటో డ్రైవర్, అతనిపాటు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి సినిమా తీయాలనుకుంటారు. నిజానికి వాళ్లకు అసలు సినిమా ఎలా తీయాలనే విషయం గురించి ఎలాంటి అవగాహన ఉండదు. మరి ఆ అమాయకమైన పల్లెటూరి వ్యక్తులు ఆ కెమెరాతో చేసిన ప్రయోగాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రైలర్ లో నటీనటులు సినిమా తీసే క్రమంలో వచ్చే సన్నివేశాలు, కామెడీ, డైలాగులు నవ్విస్తున్నాయి. ఈ ‘సినిమా బండి’ మే 14 న నెట్‌ఫ్లిక్స్లో ప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కామెడీ ఎంటర్టైనర్ ‘సినిమా బండి’ ట్రైలర్ ను వీక్షించండి.