ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘ఖిలాడీ’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ హీరోగా డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. 1 నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లోని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘ఇఫ్ యూ ప్లే స్మార్ట్ విత్ అవుట్ స్టుపిడ్ ఎమోషన్స్… యూ ఆర్ అన్ స్టాపబుల్’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక టీజర్ చివర్లో వచ్చిన ట్విస్ట్ థ్రిల్ చేస్తోంది. రవితేజ ఒక అమ్మాయిని చంపడం చూస్తుంటే ఇందులో కిల్లర్ గా కన్పించబోతున్నాడా ? అనే అనుమానం వస్తోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మీరు కూడా ‘ఖిలాడీ’ టీజర్ ను వీక్షించండి.
ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జయంతిలాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఖిలాడీ’ ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా… టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవితేజకు ఇది 67వ చిత్రం. రమేష్ వర్మ ‘రాక్షసుడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
Ram Pothineni: అనారోగ్యంతో ఉన్న అభిమానితో హీరో రామ్ వీడియో కాల్.. భోజనం చేసి మందులు వేసుకో.. నన్ను కలవొచ్చు
-
WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
-
Bihar: AK-47 ఘటనపై నిరసన.. పోలీసుల అదుపులో తేజస్వీ యాదవ్..
ట్రెండింగ్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!