Mouni Roy : హీరోయిన్ మౌనీరాయ్ సంచలన కామెంట్స్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదుర్కున్న ఇబ్బందులను బయట పెట్టింది. మౌనీరాయ్ బాలీవుడ్ లో ఫుల్ పాపులర్ బ్యూటీ అని మనకు తెలిసిందే కదా. అక్కడ సీరియల్స్ లో విలన్ పాత్రలు చేస్తూ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇక తెలుగులో నాగిని సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది.
Read Also : Balakrishna : బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఫ్యాన్స్ ఖుషీ
తనకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అవకాశాల కోసం ఓ బాలీవుడ్ డైరెక్టర్ కలిసినట్టు చెప్పింది. కథ చెప్పే క్రమంలో బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని.. ఆ ఘటన తనను చాలా కాలం వెంటాడిందని పేర్కొంది. ఎన్నో అవమానాలు, ట్రోలింగ్, బాడీ షేమింగ్ లాంటివి ఎదుర్కుని ఈ స్థాయికి వచ్చినట్టు తెలిపింది. అలాంటి డైరెక్టర్లు తన కెరీర్ లో ఎంతో మందిని చూశానని.. కానీ ఎవరికీ భయపడకుండా ట్యాలెంట్ నే నమ్ముకుని ఇక్కిడి దాకా వచ్చినట్టు చెప్పింది ఈ భామ. అయితే ఆ డైరెక్టర్ పేరు మాత్రం ఈమె బయట పెట్టలేదు.
Read Also : Madhavi Latha: రాజమౌళి దేవుణ్ణి అడ్డంగా పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నాడు..
