స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా రూపుదిద్దుకున్న తాజా సిరీస్ ‘మోతెబరి లవ్ స్టోరీ’. ఈ వెబ్ సిరీస్‌లో అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల హీరోహీరోయిన్లుగా నటించారు. దర్శకుడు శివ కృష్ణ బుర్రా, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్ అరుపుల, నిర్మాతలు మధుర శ్రీధర్ & శ్రీరామ్ శ్రీకాంత్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. ఈ సిరీస్ ఆగస్ట్ 8న ZEE5లో స్ట్రీమింగ్కి రానుంది. ఈ సందర్భంగా జీ5 మెగా ప్రివ్యూ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో తొలి నాలుగు ఎపిసోడ్లను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్లో నటీనటులు, సాంకేతిక బృందం, అతిథులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘మోతెవరి లవ్ స్టోరీ’ టీంకు హార్ట్‌ఫుల్ కంగ్రాట్స్. ఇది సిరీస్‌లా కాకుండా సినిమాలా అనిపించింది. డీవోపీ పేరు అరుపుల.. కానీ విజువల్స్ చూస్తే నిజంగా అరుపులు వచ్చేంత బాగున్నాయి. చరణ్ అర్జున్ గారు ఇచ్చిన పాటలు, బీజీఎం అద్భుతంగా ఉన్నాయి.
Also Read : Bun Butter Jam : బన్ బటర్ జామ్ ట్రైలర్ విడుదల
ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది.. దాన్ని గుర్తించి, ప్రయత్నిస్తే ఇలాంటి విజయాలు సాధ్యమే. ఫోన్‌తో మొదలైన మై విలేజ్ షో జెర్నీ ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది. అనిల్, వర్షిణి, మాన్సీ అందరూ చక్కగా నటించారు. ‘బలగం’ లెవల్లో ‘మోతెవరి లవ్ స్టోరీ’ కూడా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సిరీస్ పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు అనువైన కథా పాఠాలతో, గ్రామీణ అనుభూతులతో, హృదయానికి హత్తుకునే ఎమోషనల్ టచ్‌తో రూపొందింది. దాంతోపాటు వినోదాన్ని, విలువలను సమపాళ్లలో మిక్స్ చేసింది.