దసరా కానుకగా విడుదలైన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మంచి వసూళ్లు రాబడుతున్నాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 15 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, సినిమా ప్రియుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జయప్రకాష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తాజా సమాచారం ప్రకారం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రెండు తెలుగు రాష్ట్రాలలో రెండ్రోజుల్లో రూ .9.99 కోట్లు వసూళ్లు రాబట్టాడు.
Read Also : “మహా సముద్రం” మూడు రోజుల కలెక్షన్లు
ప్రాంతాల వారీగా 2 రోజుల కలెక్షన్లు :
నైజాం: రూ. 3.79 కోట్లు
సీడెడ్: రూ 2.08 కోట్లు
యూఏ : రూ 1.15 కోట్లు
తూర్పు: రూ. 63 లక్షలు
వెస్ట్: రూ. 53 లక్షలు
గుంటూరు: రూ. 81 లక్షలు
కృష్ణ : రూ .57 లక్షలు
నెల్లూరు: రూ. 43 లక్షలు
ఏపీ, టీఎస్ మొత్తం కలెక్షన్లు : రూ. 9.99 కోట్లు (రూ .16.90 కోట్లు గ్రాస్)
వరల్డ్ వైడ్ రెండ్రోజుల కలెక్షన్లు : రూ .12.38 కోట్లు (రూ. 21.70 కోట్లు గ్రాస్)