Mohanlal: ఏనుగు దంతాల వివాదంలో కొత్త మలుపు.. 10 దంతాలు, 13 ఐవరీ విగ్రహాల వివరాలు వెల్లడించిన మోహన్‌లాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohanlal: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ చుట్టూ గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఏనుగు దంతాల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కోర్టు విచారణను ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన వైల్డ్‌లైఫ్ అమ్నెస్టీ పథకం కింద తన వద్ద ఉన్న ఏనుగు దంతాలు, ఐవరీతో తయారైన విగ్రహాల వివరాలను అటవీ శాఖకు అధికారికంగా సమర్పించారు. ఈ తాజా డిక్లరేషన్‌తో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్రసీమలో ‘కంప్లీట్ యాక్టర్’గా గుర్తింపు పొందిన మోహన్‌లాల్‌పై చట్టవిరుద్ధంగా ఏనుగు దంతాలు ఇంట్లో ఉంచుకున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. తాజాగా ఆయన కేరళ అటవీ శాఖకు సమర్పించిన వివరాల ప్రకారం, తన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు, 13 ఐవరీ విగ్రహాలు ఉన్నట్లు వెల్లడించారు. గతంలో కేవలం నాలుగు ఏనుగు దంతాల వివరాలు మాత్రమే నమోదు చేయగా, ఇప్పుడు మరో ఆరు దంతాలతో పాటు ఐవరీతో తయారైన పలు విగ్రహాలను కూడా అధికారికంగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం, ఈ ఐవరీ విగ్రహాల్లో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వంటి హిందూ దేవతల ప్రతిమలు ఉన్నాయి. ఈ విగ్రహాల మొత్తం బరువు సుమారు 46 కిలోల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇవన్నీ తనకు వారసత్వంగా వచ్చాయని, మరికొన్ని బహుమతుల రూపంలో లభించాయని మోహన్‌లాల్ మొదటి నుంచీ వాదిస్తున్నారు. ఈ వివాదానికి మూలం 2011లో జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడులు. ఆ సమయంలో మోహన్‌లాల్ నివాసంలో అనుమతులు లేని ఏనుగు దంతాలు, విలువైన కళాఖండాలు బయటపడటంతో అటవీ శాఖ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టుల్లో కొనసాగుతోంది. కేసు నుంచి మోహన్‌లాల్‌కు ఊరటనివ్వాలని కేరళ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, ట్రయల్ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అనంతరం కేరళ హైకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థిస్తూ క్రిమినల్ విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా గతంలో ప్రభుత్వం జారీ చేసిన యాజమాన్య ధ్రువపత్రాలను కూడా రద్దు చేసింది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైల్డ్‌లైఫ్ అమ్నెస్టీ పథకం ప్రకారం, అనుమతులు లేని వన్యప్రాణుల సంబంధిత వస్తువులను స్వచ్ఛందంగా ప్రకటిస్తే వాటిని చట్టబద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ తన వద్ద ఉన్న అన్ని వస్తువుల వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వస్తువుల మూలం ఏమిటి ? అవి చట్టబద్ధంగానే లభించాయా? అన్నది నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ డిక్లరేషన్‌తో కేసు కొత్త దశలోకి ప్రవేశించింది. మోహన్‌లాల్ వెల్లడించిన వివరాలు, డీఎన్ఏ పరీక్షల ఫలితాలు, కోర్టు విచారణ తదుపరి దశలో ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. దీంతో ఈ అంశంపై సినీ వర్గాలతో పాటు న్యాయ, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!