Bheemla Nayak: ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికపై మొగులయ్యకు సత్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సినిమాలో పాట పాడిన మొగులయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొగులయ్యను వేదికపై చిత్ర యూనిట్ సన్మానించింది. భీమ్లానాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొగులయ్య మాట్లాడుతూ.. భీమ్లానాయక్ సినిమాలో తాను పాట పాడటం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను పాట పాడకపోతే తానెవరో ఎవరికీ తెలిసేది కాదన్నారు. ఇంత మంచి పేరు కూడా వచ్చుండేది కాదని అభిప్రాయపడ్డారు.
భీమ్లానాయక్ సినిమాలో పాట పాడిన తరువాత తనకు పవన్ కల్యాణ్ సన్మానం చేసి లక్ష రూపాయలు నగదు ఇచ్చారని మొగులయ్య వెల్లడించారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇల్లు ఇచ్చి సన్మానం చేసి రూ.కోటి సాయం అందించారని పేర్కొన్నారు. ఈ సినిమాలో పాట పాడిన తరువాతే ఢిల్లీలో నాకు పద్మశ్రీ అవార్డు వచ్చిందన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా తనతో అందరూ సెల్పీలు దిగుతున్నారని.. తాను ఇంత పాపులారిటీ కావడానికి భీమ్లానాయక్‌లో పాట పాడటమే కారణమన్నారు. తాను కొన్ని తప్పులు చేసినా తమన్ తనతో పాట పాడించారని చెప్పారు. ఈ సినిమాలో టైటిల్ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయని పేర్కొన్నారు. తన పాటలపై శ్రీను అనే విద్యార్థి పీహెచ్డీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు గుర్తింపు వచ్చేలా చేసిన పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు మొగులయ్య పేర్కొన్నారు.
Also Read
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!