MM Srilekha: దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. తమ సోదరులకు, సోదరీమణులు ఎంతో ప్రేమతో రాఖీలు కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం తమ సోదర సోదరిమణుల ఫోటోలను షేర్ చేస్తూ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తన అన్న రాజమౌళి గురించి సింగర్ ఎమ్ఎమ్ శ్రీలేఖ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూ పాతదే అయినా ఇప్పుడు ట్రెండ్ అవ్వడం విశేషం. ఇక ఈ ఇంటర్వ్యూలో శ్రీలేఖ మాట్లాడుతూ తన అన్నయ్యలు కీరవాణి, రాజమౌళి గురించి చెప్పుకొచ్చింది.
కీరవాణి పాడిన తెలుసా మనసా అనే సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన ఆమె కీరవాణి తరువాత ఇళయరాజా సాంగ్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక రాజమౌళి ఫ్యామిలీకి తానెప్పుడూ దగ్గరగానే ఉంటానని, సినిమాల పరంగా ఆయన తీరు వేరు, సాంగ్స్ విషయంలో తన తీరు వేరని తెలిపింది. శాంతి నివాసం అనే సీరియల్ చేసే సమయంలో రాజమౌళి తనకు చాక్లెట్లు, మ్యూజిక్ ఆల్బమ్స్ కొనిచ్చేవాడని, డైరెక్టర్ అయ్యాకా రాజమౌళి మారిపోయారని.. ఎందుకంటే పని ఎక్కువ అవ్వడంతో బిజీగా మారిపోయినట్లు తెలిపింది. దీంతో ప్రస్తుతం శ్రీలేఖ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.