Chandramukhi 2: ఇప్పుడు హర్రర్ ఫిల్మ్స్ అంటే.. టెక్నాలజీతో ఎక్కడలేని మాయలు తీసుకొచ్చి చూపించేవారు. కానీ.. కొన్నేళ్ల క్రితం.. ఈ టెక్నాలజీ లేనప్పుడు కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకులను భయపెట్టాయి. అందులో ఖచ్చితంగా టాప్ 10 లిస్ట్ లో చంద్రముఖి ఉంటుంది. రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతగా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దాదాపు 18 ఏళ్ళ తరువాత చంద్రముఖికి సీక్వెల్ ప్రకటించాడు పి. వాసు. రజినీకాంత్ ప్లేస్ లో రాఘవ లారెన్స్ నటిస్తుండగా.. ఈసారి చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది. వడివేలు, రాధిక ముఖ్య పాత్రలు పోషించారు. ఇ చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి.. కీరవాణి చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Kannada Actresses: మొన్న సౌందర్య.. నేడు జగతి.. భర్తలను వదిలి.. వారితో ఎఫైర్.. ?
” లైకాప్రొడక్షన్స్ చంద్రముఖి 2 చూడడం జరిగింది. సినిమాలోని పాత్రలు మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయి. ఇక ఆ సన్నివేశాలకు నా మనసుకు హత్తుకునేలా సంగీతంతో జీవం పోయడానికి నాకు 2 నెలలు పట్టింది. నేను కూడా 2 నెలలు నిద్ర లేని పగలు రాత్రి గడిపాను. గురుకిరణ్ & నా స్నేహితుడు విద్యాసాగర్ దయచేసి నాకు శుభాకాంక్షలు తెలపండి” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. లారెన్స్ సినిమా అంటేనే తడిసిపోతుంది.. ఇక దానికి కీరవాణిబ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే ఇక చెప్పనవసరం లేదు. కీరవాణి ఇచ్చిన హైప్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి చంద్రముఖి 2 అభిమానులు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో చూడాలి.
Watched @LycaProductions Chandramukhi 2. The characters in the movie spend sleepless nights from fear of DEATH . for me 2 months of sleepless days and nights for adding LIFE to the mind blowing scenes with my efforts. GuruKiran & my friend Vidyasagar pls wish me the best 🙏🙏
— mmkeeravaani (@mmkeeravaani) July 23, 2023