MM keeravaani Interview: ‘ఆస్కార్’తో కొంచెం కూడా ఉపయోగం లేదు: కీరవాణి ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MM keeravaani Interview for Naa Saami Ranga Movie: కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరచిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్న క్రమంలో విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నా సామిరంగ ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్ లా వస్తుంది.. ? ఆస్కార్ తో వచ్చిన హైప్ వలన ‘నా సామిరంగా’ పై ప్రభావం ఎలా ఉంటుంది ?
-నేను మొదటి నుంచి సెలక్టివ్ గా చేస్తున్నా. సినిమాకి హైప్ అనేది రిలీజ్ అయ్యే పాటల ద్వారా వస్తుంది, ఆస్కార్ అనేది ఒక సినిమా సక్సెస్ కి కొంచెం కూడా పనిచేయదని భావిస్తా. నా వరకు బాగా వర్క్ చేయాలి, డైరెక్టర్ బాగా తీయాలి, అది జనాలకి కనెక్ట్ కావాలి.
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
నా సామి రంగాకి పని చేయడానికి ఆసక్తి కనబరిచిన అంశాలు ఏమిటి?
-నాగార్జునతో పని చేయడం నాకు అలవాటైన విద్య. మా కాంబినేషన్ ఎప్పుడూ విజయం సాధిస్తూ వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం వుంది. కొత్త దర్శకుడు బిన్నీ ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. కొత్త దర్శకుడు ఎలాగైనా నిరూపించుకోవాలని కసితో పని చేస్తాడు, ఇలాంటి కొత్త దర్శకులతో పని చేయడం ఆసక్తిగా ఉంటుంది.
నాగార్జునతో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు నుంచి అన్నమ్మయ్య ,. శ్రీరామదాసు ఇలా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు.. నా సామిరంగ ఎలాంటి కొత్త అనుభూతిని ఇచ్చింది ?
-ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఎంతటి ఘన విజయం సాధించిందో నా సామిరంగ కూడా అలాంటి విజయం అందుకుంటుంది. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం విలేజ్ నేపథ్యం ఉన్న సినిమా, ఇది కూడా అంతే. అందులో ఎన్ని రకాల వినోదాత్మకమైన అంశాలు ఉంటాయో ఇందులో కూడా అన్నీ వుంటాయి. ఇది మరో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అవుతుంది. ‘నా సామిరంగ’ నాగార్జునకి యాప్ట్ టైటిల్. తెలుగు సంప్రదాయం, మన కట్టుబాట్లు, నేటివిటీ, సంక్రాంతి పండగ కళ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. సంగీతం కూడా ఫ్రెష్ గా ఉంటుంది.
ఇందులో మీరు కూడా ఒక పాట రాశారు కదా ?
-ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ చంద్రబోస్. అన్నం తిన్నప్పుడు కొంచెం పచ్చడి నంచుకుంటాం, అలా అని పచ్చడి తిన్నామని ప్రత్యేకంగా చెప్పం కదా, ఇదీ అంతే. నేను ప్రొఫిషనల్ లిరిక్ రైటర్ ని కాదు, ఎవరైనా వచ్చి రాయమని అడిగినా రాయను. కానీ రీరికార్డింగ్ చేసినప్పుడు ఒక సందర్భం పుడుతుంది. అలాంటి సందర్భంలో నుంచి ఆలోచన వస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి రాశా, నేను అవసరమైతేనే రాస్తాను.
కొత్త దర్శకుడు విజయ్ బిన్నీలో మీరు గమనించిన అంశాలు ఏమిటి ?
-చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. దాని వలన ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా త్వరగా ఈ సినిమా తీయగలిగాడు. క్వాలిటీ తగ్గకుండా తొందరగా సినిమా తీయడం తన ప్రధాన బలం అని భావిస్తున్నాను. తను డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ప్రతి పాట డ్యాన్స్ కోణంలో ఆలోచించడం సహజం, కానీ దానికి భిన్నంగా ఇందులో చాలా మంచి మూడు మెలోడీస్ చేయించారు. తను పరిపక్వత వున్న దర్శకుడనిపించింది.
ఇప్పుడు పాట ఎంతలా వైరల్ అయ్యిందనేది పాట విజయానికి కొలమానం అయిపోయింది కదా.. కొన్ని మంచి పాటలు కొన్ని సార్లు వైరల్ కావు.. దీన్ని ఎలా చూస్తారు ?
-పాట వైరల్ అవ్వడం అనేది మన చేతిలో లేదు, ఒకప్పుడు పాట హిట్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే ఏదైనా పెళ్లికి వెళ్లి.. అక్కడ బ్యాండ్ లో ఆ పాట ప్లే చేస్తున్నారా లేదా అన్న దాని బట్టి తెలుసుకునే వాళ్ళు. ఇప్పుడు వ్యూస్ ని బట్టి తెలుస్తోంది. నిజాయితీగా పని చేయడం మాత్రమే మన చేతిలో వుంది. వైరల్ అనేది మన చేతిలో లేదు.
ఈ మధ్య కాలంలో మ్యూజిక్ పరంగా మీకు నచ్చిన చిత్రాలు ?
యానిమల్ బాగుంది, జైలర్ నేపధ్య సంగీతం నచ్చింది, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి మెసేజ్ కూడా పెట్టాను.
మీరు చేసిన పాటల్లో మిమ్మల్ని వెంటాడే పాట ?
-ఒక యాభై, వంద వరకు వుంటాయి.
రాజమౌళితో చేయబోయే కొత్త సినిమా వర్క్ ఎప్పుడు నుంచి ఉంటుంది ?
-దాని గురించి తెలుసుకోవాలంటే రాజమౌళి కి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఫోన్ చేస్తే అది ఆఫ్ లో ఉంటుంది(నవ్వులు) అంటే ఇంకా వర్క్ నా వరకు రాలేదని అర్థం.
హరిహర వీరమల్లు పాటలు గురించి ?
-ప్రస్తుతానికి మూడు పాటలు రికార్డ్ చేశాం.
చిరంజీవి 156 సినిమా వర్క్ ఎంత దాకా వచ్చింది ?
-షూటింగ్ జరుగుతోంది, మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
తాజావార్తలు
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?