Site icon NTV Telugu

MLA Roja: జబర్దస్త్ కు రోజా గుడ్ బై.. కారణం అదేనా ?

Roja

Roja

ఒకప్పుడు జబర్దస్త్ అంటే నాగబాబు, రోజా అల్టిమేట్ కాంబో.. నాగబాబు నవ్వు.. రోజా అదిరిపోయే పంచ్ లతో ఆ షో ఒక రేంజ్ లో ఫేమస్ అయ్యింది. ఇక కొన్ని కారణాల వలన నాగబాబు షో నుంచి తప్పుకున్నా రోజా మాత్రం తనకు అచ్చి వచ్చిన జబర్దస్త్  వదలలేదు. ఒకపక్క ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోపక్క జబర్దస్త్ షో పై అందంతో ఆకట్టుకొంటూనే ఉంది. ఎంతమంది జడ్జ్ లు వచ్చినా.. వెళ్లినా రోజా లేని జబర్దస్త్ ని ఉహించుకోలేం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం రోజా జబర్దస్త్ ని వీడే సమయం వచ్చిందా..? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. రోజా ప్రస్తుతం వైఎస్సార్ సీపీ పార్టీ తరపున నగరి ఎమ్మెల్యే గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జగన్ కేబినెట్ మంత్రుల లిస్ట్ లో రోజా పేరు కూడా ఉన్న విష్యం విదితమే. దీంతో మరొకొన్నిరోజుల్లో రోజా మంత్రి పదవిని చేపట్టనుంది.

మంత్రి పదవి అందుకున్నాకా కూడా జబర్దస్త్ ను కొనసాగిస్తుందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే మంత్రి అంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి.. అక్కడ  వాటన్నింటిని వదిలి జబర్దస్త్ లో కామెడీ చూసుకుంటూ కూర్చుంటారా..? రోజా ఖచ్చితంగా జబర్దస్త్ ని వదిలి వెళ్లాలి అని కొందరు అంటుండగా.. మరికొందరు ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇలాంటి మాటలే అన్నారు. కానీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా జబర్ధస్ మాత్రం మానలేదు.. ఇప్పుడు కూడా అలాగే వస్తారు అని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. రోజా మంత్రి తరువాత జబర్దస్త్ కి రారు అనే మాటే ఎక్కువ వినిపిస్తుంది. అందుకనే ఛానెల్ యాజమాన్యం కూడా రోజా ప్లేస్ ని భర్తీ చేయడానికి ఇంకొంతమంది సీనియర్ హీరోయిన్స్ ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే రోజా నోరువిప్పాల్సిందే.

Exit mobile version