Rubal Shekhawat: మొదటిదేమైందో తెలియదు… రెండో దానికి రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ey Pilla: అందాల భామలుగా కిరీటి ధారణ జరుపుకున్నంత మాత్రాన సినిమా అవకాశాలు వచ్చేస్తాయని అనుకోలేం. ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, ప్రియాంక చోప్రా వంటి కొద్దిమంది మాత్రమే స్టార్ హీరోయిన్స్ కాగలరు. అయితే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఏదో ఒక కేటగిరిలో అగ్రస్థానంలో నిలిచిన వాళ్ళు వాణిజ్య ప్రకటనల్లో బాగానే చోటు దక్కించుకుంటూ ఉంటారు. గత యేడాది మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన రుబల్ షెకావత్ కు అలానే కమర్షియల్స్ లో నటించే ఛాన్స్ దక్కింది. రాజస్థాన్ కు చెందిన రుబల్ ముగ్గురమ్మాయిలలో చివరిది. అక్కల ప్రోత్సాహంతో పాటు తండ్రి ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగ పర్చుకుని ఫెమినా అందాల పోటీల్లో పాల్గొంది. రన్నరప్ గా నిలిచింది. ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపరేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసిన రుబల్ కు నటన అంటే ఇష్టం. అందుకే జైపూర్ నుండి తన మకాం ముంబైకు మార్చింది. అక్కడకు వెళ్ళగానే ఆమెకు రణవీర్ సింగ్ తో కలిసి ఓ కమర్షియల్ లో నటిచే ఛాన్స్, ఇమ్రాన్ తో కలిసి ఓ పాటలో నర్తించే అవకాశం లభించాయి. చిన్నప్పటి నుండీ షారుఖ్ ఖాన్ అభిమాని అయిన రుబల్ ఎప్పటికైనా అతనితో కలిసి వర్క్ చేస్తానని కలలు కంటోంది.
ఇదిలా ఉంటే… గత యేడాది ఆగస్ట్ లో రుబల్ షెకావత్ కు తెలుగులో ఓ సినిమా ఛాన్స్ లభించింది. అవకాశాల కోసం చెకోర పక్షిలా ఎదురుచూస్తున్న అమ్మడు దాన్ని ఠక్కున క్యాచ్ చేసింది. మాస్ మహరాజా రవితేజ సోదరుడు రఘు కొన్ని సినిమాలలో నటించాడు. అతని కొడుకు మాధవ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మాధవ్ తో ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి (శ్రీనివాస్) ‘ఏయ్ పిల్లా’ అనే ఈ మూవీని ప్లాన్ చేశారు. రమేశ్ వర్మ కథను అందించిన ఈ మూవీతో లూధిర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆగస్ట్ లో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెప్పారు. కానీ ఆ తర్వాత ప్రోగ్రెస్ ఏమిటో తెలియ రాలేదు. రుబల్ తొలి తెలుగు సినిమా పరిస్థితి ఇలా ఉంటే, తాజాగా ఆమెకు మరో ఛాన్స్ లభించింది. త్రిగుణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘అవసరానికో అబద్దం’లో రుబల్ హీరోయిన్ గా బెర్త్ కన్ ఫామ్ చేసుకుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారమే మొదలైంది. అందం విషయంలో వంక పెట్టడానికి లేని రుబల్ కు ఇలా బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు రావడం సహజం. బట్ ఆ సినిమాలు జనం ముందుకు వచ్చి, ఆమెకు నటిగా మంచి మార్కులు పడితే తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకోగలదు. చూద్దాం… ఏం జరుగుతుందో!!
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..