రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ ‘రాజ్ దూత్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలానే ‘కోతి కొమ్మచ్చి’ మూవీలోనూ హీరోగా నటించాడు. అది విడుదల కావాల్సి ఉంది. ఆగస్ట్ 15 శ్రీహరి జయంతి. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్… శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. సి.కె. ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్‌పై నిర్మితం కాబోతున్న ఈ సినిమాకు ‘రాసిపెట్టుంటే’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మూవీకి నందు మల్లెల డైరెక్టర్. శ్రీహరి జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కాస్తంత భిన్నంగానే ఉంది. సూర్యాస్తమయం సమయంలో ఓ బస్సు ఫెన్సింగ్ కు అవతల వెళుతూ ఉన్న ఈ పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.