Chiranjeevi: బిగ్ బి కి సర్ ప్రైజ్ ఇచ్చిన చిరు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు మెగాస్టార్ చిరంజీవి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నేడు అమితాబ్ పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అమితాబ్ బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఇక ఇప్పటికే ట్విట్టర్ ద్వారా చిరు.. అమితాబ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. “గురూజీ.. మీకు 81వ జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషం నిండిన దీర్ఘాయువుతో ఆశీర్వదించబడాలి. మీ నటన, ప్రతిభా పాటవాలతో, అనేక సంవత్సరాల పాటు మీరు లక్షలాది మందిని ఆకట్టుకుని స్ఫూర్తినిస్తూనే ఉండండి. ఈ మీ పుట్టినరోజు కూడా నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మీ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఈ రోజు రాత్రి వర్చువల్‌గా నా ఆరాధ్యదైవమైన మిమ్మల్ని కలిసేందుకు నేను ఎదురు చూస్తున్నాను” అని రాసుకొచ్చారు.
ఇక చెప్పినట్లుగానే కౌన్ బనేగా కరోడ్‌పతి షో లో చిరు సర్ప్రైజ్ ఇచ్చారు. షో జరుగుతున్న మధ్యలో ఒక వీడియో ద్వారా చిరు మాట్లాడుతూ.. ” ప్రణామమ్ అమిత్ జీ.. ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అమిత్ జీ.. నాకెంతో కావాల్సినవారు. ఆయన మాటలు నన్నెంతో స్ఫూర్తిపొందేలా చేసాయి. హ్యాపీ బర్త్ డే అమిత్ జీ” అంటూ చెప్పారు. ఇక ఇది ఊహించని అమితాబ్ షాక్ అయ్యారు. చిరు చెప్పిన మాటలకు అమితాబ్ కంటతడి పెట్టుకొని.. థాంక్యూ చిరు సర్ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అమితాబ్, చిరు కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో కలిసి నటించారు.
Also Read
Megastar @KChiruTweets garu wished @SrBachchan garu on his birthday on the KBC show. Airing today.
Amit sir didn't expect this, he was shocked to see Chiru garu and after he was so touched with the great words by Chiru garu. #AmitabhBachchanBirthday #Chiranjeevi #KBC pic.twitter.com/IDjKLZAtEj
— Naveen Kumar (@Only_Naveen) October 11, 2023
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!