మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోని బయ్యర్స్ కి భారీ నష్టాలని మిగిలిచింది. ప్రొడ్యూసర్స్ కి చిరుకి మధ్య గొడవలు అనే వార్త భోళా శంకర్ సినిమాతో విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. దీంతో అనిల్ సుంకర బయటకి వచ్చి చిరు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు, ఇలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేయకండి అంటూ క్లారిటీ ఇచ్చాడు. తమిళ వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ సినిమాలో చిరుకి చెల్లిగా కీర్తి సురేష్, హీరోయిన్ గా తమన్నా నటించారు. రిలీజ్ కి ముందు ట్రైలర్ తో మంచి బజ్ ని జనరేట్ చేసింది కానీ థియేటర్స్ లో ఆడియన్స్ ని మెప్పించడంలో భోళా శంకర్ ఫెయిల్ అయ్యింది.
భోళా శంకర్ సినిమా తేడా కొట్టింది కానీ చిరు మాత్రం చాలా యంగ్ గా, బెస్ట్ లుక్స్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా కనిపించాడు. చిరు మార్క్ కామెడీ టైమింగ్ భోళా శంకర్ సినిమాలో సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది, దీన్ని వాడుకుంటూ సినిమాని కాస్త బాగా తీసి ఉంటే సాలిడ్ హిట్ పడేది కానీ మెహర్ వేదాళం కథని లోకలైజ్ చెయ్యడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. పదేళ్ల క్రితం కథని ఇప్పటి పరిస్థితులకి, తెలుగు నేటివిటీ తగ్గట్లు మార్చకపోవడమే భోళా శంకర్ రిజల్ట్ కి కారణం అయ్యింది. సినిమా రిజల్ట్ ని పక్కన పెట్టి చిరుని చూడాలి అనుకున్న మెగా ఫ్యాన్స్ మాత్రం థియేటర్స్ కి వెళ్లారు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చోని భోళా శంకర్ సినిమాని చూసే ఛాన్స్ వచ్చింది. ఈరోజు నుంచి భోళా శంకర్ సినిమా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతోంది. చిరు ఉన్నాడు, కామెడీ ఉంది, తమన్నా గ్లామర్ కూడా ఉంది కాబట్టి భోళా శంకర్ సినిమాని ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసి ఎంజాయ్ చేయండి.